మెగా హెల్త్ క్యాంపుకు విశేష స్పందన..
బిక్కనూర్, ఆంధ్రప్రభ : మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మంగళవారం నిర్వహించిన మెగా హెల్త్ క్యాంపుకు విశేష స్పందన లభించింది. 99 రోజుల ప్రజా పాలన ప్రగతి నివేదిక కార్యక్రమంలో భాగంగా జిల్లా వైద్యశాఖ ఆధ్వర్యంలో మెగా హెల్త్ క్యాంపు నిర్వహించారు. ఆరు విభాగాలకు చెందిన వైద్యుల ఆధ్వర్యంలో రోగులకు పలు రకాల వైద్య పరీక్షలు నిర్వహించారు 183 మంది రోజులు రిజిస్ట్రేషన్ చేసుకోగా వారికి వైద్య పరీక్షలు నిర్వహించారు.
అనంతరం వారికి కావలసిన మందులు ఉచితంగా పంపిణీ చేశారు .ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన మెగా హెల్త్ క్యాంపును పట్టణ సర్పంచ్ బల్యాల రేఖా సుదర్శన్ ప్రారంభించారు .అనంతరం ఆమె మాట్లాడుతూ సమాజంలో ప్రతి ఒక్కరూ సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలన్నారు.
మెగా హెల్త్ క్యాంపు నిర్వహించడం ఎంతో అభినందనీయమని చెప్పారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆరోగ్య విస్తీర్ణ అధికారి వెంకటరమణ పర్యవేక్షణలో మెగా హెల్త్ క్యాంప్ కొనసాగింది. కార్యక్రమంలో సిద్ధి రామేశ్వర ఆలయ కమిటీ చైర్మన్ లింబాద్రి, మండల బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సుదర్శన్, గ్రామ సచివాలయ వార్డు సభ్యులు, స్థానిక వైద్య సిబ్బంది, ఆశా వర్కర్లు పాల్గొన్నారు.
