ఘనంగా మట్టల ఆదివార వేడుకలు

ఘనంగా మట్టల ఆదివార వేడుకలు

పురవీధులు గుండా బహిరంగ ప్రదర్శనలు
ఆర్సిఎం విచారణ పాదర్లు జేసు ప్రసాద్,అరుణ్

ఆళ్ళపల్లి,ఆంధ్రప్రభ : మండల కేంద్రంలోని రోమన్ క్యాథలిక్ మిషన్ ఆర్సియం చర్చి ఆద్వర్యంలో క్రైస్తవ భక్తులు, విశ్వాసులు మ్రానికొమ్మల (మట్టల) ఆదివారం వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగిందని,ఆర్సియం చర్చి విచారణ గురువు రెవరెండ్ పాదర్లు జేసు ప్రసాద్, గబ్బెట అరుణ్ లు అన్నారు. బహిరంగ ప్రదర్శన ఊరేగింపు కార్యక్రమాల అనంతరం మాట్లాడుతూ.. ఫిబ్రవరి 18న శ్రమల, ఉపవాస దీక్షలు ప్రారంభం అయ్యాయి.

మట్టల ఆదివారం రోజున క్రీస్తు ప్రభువును దావీదు తనయుడుగా, యూదుల రాజుగా హోసన్నా, హోసన్నా, జయం జయంతో నినాదాలు చేస్తూ, కొబ్బరి, ఈత మట్టలను చేతబూని ఊరేగింపుగా పురవీధుల గుండా మేళతాలతో ప్రభువును మెరుషలేము చర్చికి ఆహ్వానించిన రోజున మట్టల ఆదివారం వేడుకను నిర్వహించుకుంటారని, సాతానుపై క్రీస్తు ప్రభువు విజయం సాధించిన విజయానికి సూచనగా కొబ్బరి, మట్టలతో బహిరంగంగా ఊరేగింపు నిర్వహించడం యూదుల, క్రైస్తవుల ఆచారమన్నారు. అదే క్రమంలో ప్రపంచ వ్యాప్తంగా ఆర్సిఎం క్రైస్తవులు అత్యంత భక్తిశ్రద్ధలతో మ్రానికొమ్మల ఆదివారాన్ని ఘనంగా నిర్వహించుకోవడం క్రైస్తవుల ఆనవాయితిగా వస్తుందన్నారు.

గాడిదపిల్లపై ఎరుషలేము దేవాలయానికి ఏసుప్రభు ప్రేమించడం వినయానికి విధేయతకు నిదర్శనమన్నారు. గాడిద పిల్లను ద్వేషించే జంతువుగా భావించే యూధులకు, క్రీస్తు ప్రభువు ఎన్నిక లేని దానిని సమాజంలోని తీసివేయబడిన వారిని, ఇంటికి తీసేసిన మూలరాయి తరహాలో దేవుడు పేదలను ఆసీనంపై ఆశీర్వదించి, గర్వత్ములను, అహంకారులను, అధికారులను ఆసీనాలపై త్రోచేసిన తరహాలో దేవుడు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమిస్తారని వారు ఉపదేశించారు.

ఈ కార్యక్రమంలో దీనసేవ సభ సిస్టర్స్ సపిరియర్ ప్రశాంత, దామరిస్,మహిత, ఉమ్మడి ఖమ్మం జ్యోతిర్మయి యానిమేటర్ పరమ ప్రభాకర్, ఉపదేశులు కిసరీ కిరణ్, నాగేశ్వరరావు, ఆంథోనీ, రాములు సంఘ నాయకులు రామ్మూర్తి, నాగేశ్వరరావు, రాంబాబు, మరియదలం సభ్యులు పరమ సులోచన, సునీత, జ్యోతి, లక్ష్మి, రాజీ, మంగా, అన్నపూర్ణ, రుక్మిణి, జయమ్మ, ఏసుమని, రమణ, లీలమ్మ, లలిత, మద్దెల నవీన్, జోజీ, బన్నీ, సంజయ్, సాల్మన్ రాజ్, ప్రవీణ్, అబ్రహాం, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply