letter for cm|లెక్క‌కు మించి అక్ర‌మాలు, అవినీతి

letter for cm|లెక్క‌కు మించి అక్ర‌మాలు, అవినీతి

అక్ర‌మార్కుల‌పై విచార‌ణ జ‌ర‌పాలి
సీఎంకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల లేఖ‌

ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : అవినీతి ఆరోణ‌లు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలపై విచార‌ణ జ‌ర‌పాల‌ని సీఎం రేవంత్ బీఆర్ఎస్ స‌భ్యులు లేఖ రాశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండున్నర సంవత్సరాల కాలంలో రాష్ట్రం అవినీతి కుంభకోణాలకు కేంద్రంగా మారిపోయిన దుస్థితి నెలకొందని లేఖలో ఎమ్మెల్యేలు తెలిపారు. లెక్కకు మించిన కుంభకోణాలు వరుసగా బయటపడుతుండటం మాత్రమే కాకుండా.. స్వయంగా మంత్రులు, ప్రజాప్రతినిధుల ప్రమేయంతో ఈ అక్రమాలు జరుగుతున్నాయనే ఆరోపణలు ప్రజల్లో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తిస్తున్నాయని అన్నారు. వారి అవినీతి, కుంభకోణాలపై సభా సంఘం లేదా సిట్టింగ్ జడ్జితో పాటు మరో 19 అంశాలపై విచారణ చేయించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. వారు వెంట‌నే పదవులకు రాజీనామా చేయాలని బీఆర్‌ఎస్‌ శాసనసభాపక్ష సభ్యులు డిమాండ్ చేశారు. అప్ప‌ట్లో అవినీతి, కుంభకోణాలపై లేఖ రాస్తే విచారణ జరుపుతామని శాసనసభలో స్వయంగా సీఎం ప్రకటించారని, రేవంత్ వెంట‌నే ఈ లేఖ‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకొని మాట నిల‌బెట్టుకోవాల‌ని కోరారు. కుంభకోణాలపై వెంటనే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించి, బాధ్యుల‌ను కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

విచార‌ణ జ‌ర‌పాల‌ని డిమాండ్ చేసిన స్కామ్‌లివే..

  • సివిల్ సప్లై స్కామ్
  • అమృత్ టెండర్ల స్కామ్​
  • కేఎల్​ఎస్​ఆర్​ స్కామ్​
  • నైనీ కోల్ బ్లాక్ – సింగరేణి స్కామ్​
  • సింగరేణి ఓబీ స్కామ్​
  • సోలార్ పవర్ స్కామ్​
  • ఎన్టీపీసీ థర్మల్ పవర్ స్కామ్
  • హెచ్‌సీయూ భూముల స్కామ్​
  • లగచర్ల ల్యాండ్ స్కామ్​
  • కోటి ఎకరాల భూమి నిషేధిత జాబితా స్కామ్
  • ఎక్సైజ్ మైక్రో బ్రూవరీ స్కామ్​
  • హమ్ రోడ్స్ స్కామ్​
  • టీడీఆర్​ స్కామ్​
  • యంగ్ ఇండియా స్కూల్స్ స్కామ్​
  • ఫోర్త్ సిటీ స్కామ్​
  • హిల్ టీపీ స్కామ్​
  • అక్రమ మైనింగ్ స్కామ్​
  • డెక్కన్ సిమెంట్స్ స్కామ్​
  • మంచి రేవుల దేవాదాయ భూముల కుంభకోణం