పశ్చిమలో ఘనంగా టీడీపీ ఆవిర్భావ వేడుకలు

పశ్చిమలో ఘనంగా టీడీపీ ఆవిర్భావ వేడుకలు
భవానిపురం, ఆంధ్రప్రభ : విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. తెలుగుదేశం పార్టీ స్థాపకుడు నందమూరి తారక రామారావు ప్రతిపాదించిన పసుపు జెండా ఆశయాలను స్మరించుకుంటూ కార్యక్రమం జరిగింది. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న అధ్యక్షతన జరిగిన ఈ వేడుకల్లో సీనియర్ నాయకుడు సోలంకి రాజు పార్టీ జెండాను ఆవిష్కరించారు.
అనంతరం నాయకులు, కార్యకర్తలకు మిఠాయిలు పంచి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు ఎన్టీఆర్ ఆశయాలను కొనసాగిస్తూ ప్రజాసేవలో ముందుండాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రాష్ట్ర టీడీపీ సెక్రటరీ సాదరబోయిన ఏడుకొండలు, గణపా రాము, పిళ సుదర్శన్, నందం భవాని ప్రసాద్, ఈగల సాంబ, అమరా మురళి తదితరులు పాల్గొన్నారు.

