ఉల్లాస్ పరీక్షలు రాసిన 72 సంవత్సరాలు వృద్ధురాలు

సిర్పూర్ (యు), ఆంధ్రప్రభ: కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ (యు) మండలంలో ఆదివారం స్వయం సహాయక సంఘాల మహిళలకు నిర్వహించిన ఉల్లాస్ అక్షరాస్యత పరీక్షల్లో 72 సంవత్సరాల ఆదివాసి వృద్ధురాలు మెస్రం జీజాబాయి పాల్గొని పరీక్ష రాయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
సిర్పూర్ (యు) ఐకేపీ ఏపీఎం మైస రమేష్ పరీక్షలను పరిశీలించగా, జీజాబాయి అక్షరాలను సులభంగా చదవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అక్షరాస్యత కార్యక్రమం ద్వారా తాను చదవడం నేర్చుకున్నానని వృద్ధురాలు తెలిపింది.
దీంతో ఏపీఎం మైస రమేష్ ఆమెను అభినందిస్తూ, వయస్సు అడ్డంకి కాదని, నేర్చుకోవాలనే ఆసక్తి ఉంటే ఎవరికైనా సాధ్యమేనని పేర్కొన్నారు.
