ఖర్గే దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలి

ఖర్గే దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలి
బీజేపీ డిమాండ్
చెన్నూర్, ఆంధ్రప్రభ: కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గేతో పాటు రాహుల్, సోనియా గాంధీలు దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ అన్నారు. దేశ ప్రధాని నరేంద్ర మోడీని టెర్రరిస్టుగా అభివర్ణించిన మల్లికార్జున్ ఖర్గే వ్యాఖ్యలకు నిరసనగా నేడు చెన్నూరు పట్టణ శాఖ ఆధ్వర్యంలో కొత్త బస్టాండ్ వద్ద రాస్తారోకో నిర్వహించి ఖర్గే దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ఈ సందర్భంగా భాజపా జిల్లా అధ్యక్షులు నగునూరీ వెంకటేశ్వర్ గౌడ్ మాట్లాడుతూ.. వరుసగా మూడుసార్లు పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచి దేశ ప్రధానిగా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన నరేంద్ర మోడీని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే టెర్రరిస్ట్‌గా అభివర్ణించడం సిగ్గుచేటని అన్నారు.
దేశంలో త్రిపుల్ తలాక్ తొలగించారని ఈ దేశంలో మహిళా బిల్లు అమలు చేయడా
నికి కృషి చేస్తున్నారని, పాకిస్తాన్ తీవ్రవాద స్థావరాలపై ఎయిర్ స్ట్రైక్ చేసి తగిన బుద్ధి చెప్పి నారని.. విజయాలన్నింటినీ చూసి ఓర్చుకోలేని కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రధాని నరేంద్ర మోడీని అవమానించడం అలవాటుగా చేసుకున్నారని దీనికి దేశ ప్రజలు కాంగ్రెస్ పార్టీ నాయకులకు తగిన బుద్ధి చెప్తారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దుర్గ అశోక్ పట్టణ అధ్యక్షులు తుమ్మ శ్రీ పాల్ , రాపర్తి వెంకటేశ్వర్, కొండపాక చారి ,గర్రెపల్లి వెంకట నరసయ్య, జాడి తిరుపతి, కేవీఎం శ్రీనివాస్,, రాజశేఖర్ గౌడ్, శివ కృష్ణ, కాగిత వెంకటేష్ మాణిక్‌రావు శంకర్, అడప శ్రీనివాస్, ముత్యాల శ్రావణి, ఏడ్ల స్వరూప, అమ్మిరి శెట్టి రమేష్, కర్ని వెంకట్, తదితర బిజెపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
