టీడీపీ కుటుంబానికి సహాయం…

టీడీపీ కుటుంబానికి సహాయం…

రాప్తాడు, ఆంధ్రప్రభ : రాప్తాడు మండలంలోని మారూరు గ్రామనికి చెందిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు బుడగ లక్ష్మీదేవి అనివార్య కారణాల వలన మృతి చెందారు. విషయం తెలుసుకున్న టీడీపీ మండల ఇన్చార్జి ధర్మవరపు మురళి వెంటనే స్పందించి లక్ష్మీదేవి అంత్యక్రియలకు రూ.10000 సహాయం అందజేశారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలియజేశారు. కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

అలాగే ప్రభుత్వం నుంచి అందే ప్రతి ఒక్క పథకాన్ని అందేలా చూస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మరూరు పిఎసిఎస్ చైర్మన్ గోపాల్ నాయుడు గ్రామ కమిటీ అధ్యక్షుడు వడ్లమూడి మేనకా దేవి వడ్లమూడి కేశవయ్య డీలర్ నారాయణస్వామి చీర్ల వెంకటేష్ కడితి రాజు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply