సిఐ శ్రీ హర్ష పై క్రిమినల్ కేసు నమోదు చేయాలి

సిఐ శ్రీ హర్ష పై క్రిమినల్ కేసు నమోదు చేయాలి

రాప్తాడు, ఆంధ్రప్రభ : హనీ ట్రాప్ లో ప్రధాన ముద్దాయిలకు సహకరించినందుకు రాప్తాడు సిఐ శ్రీహర్ష పై కేసు నమోదు చేసి పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి డ్యూటీ నుండి డిస్మిస్ చేయాలని సిపిఎం పార్టీ అనంతపురం రూరల్ రాప్తాడు ప్రాంతీయ కమిటీ కార్యదర్శి టి రామాంజనేయులు పేర్కొన్నారు. ఆదివారం రాప్తాడు మండల కేంద్రంలో ప్రెస్ మీట్ ద్వారా జిల్లా ఎస్పీ కి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సిపిఎం పార్టీ ప్రాంతీయ కార్యదర్శి టి రామాంజనేయులు మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో వారం రోజుల నుంచి సంచలనం అవుతున్న హానీ ట్రాఫ్ కేసు కొత్త మలుపులు తిరుగుతోంది. కొత్త కొత్త వాళ్ళ పేర్లు బయటికి వస్తున్నాయి.

రాప్తాడు సిఐ శ్రీహర్షను విఆర్ కు పంపినంత మాత్రాన ఎలాంటి ప్రయోజనం లేదు. రెండు మూడు నెలలు ఉంటే తిరిగి మళ్లీ విధుల్లోకి వస్తారు. రాప్తాడు మండలంలో డ్యూటీ చేసినప్పుడు నుండి అనేక అవినీతి అక్రమాలకు పాల్పడ్డాడని రోజు సివిల్ పంచాయతీలు దుప్పటి పంచాయతీలు పోలీస్ స్టేషన్ లోనే చేసుకుంటూ లక్షల రూపాయలు ప్రజల నుంచి దోచుకున్నారని మండలంలో ప్రజల నుండి బలమైన ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఈ మధ్యకాలంలో రాప్తాడు పంచాయతీ పరిధిలో ఇంటి దగ్గర జరిగిన చిన్న గొడవను ఇరు పక్షాలవారికి సర్ది చెప్పి పంపాల్సింది పోయి ఏకపక్షంగా వ్యవహరించి వన్ సైడ్ కేసు నమోదు చేసినారు. అందులోనూ చదువుకుంటున్నటువంటి ఒక అబ్బాయి పైన దుర్మార్గంగా కేసు నమోదు చేయడం జరిగింది. ఇలాంటివి అనేకం ఉన్నాయి డీఎస్పీ ఆఫీస్ కు పక్కనే ఉన్నటువంటి సీఐ పైన నిఘా లేకపోవడం ఇంటెలిజెన్స్ రిపోర్టు కూడా సీఐ పైన ప్రభుత్వానికి సక్రమంగా నివేదిక ఇవ్వకపోవడం వల్లే ఇలా జరిగిందని మండల ప్రజలు అభిప్రాయ పడుతున్నారు.

రాప్తాడు నియోజకవర్గంలో ఏ పోలీసు అధికారి ఇంత దుర్మార్గంగా వ్యవహరించలేదు. పోలీస్ వ్యవస్థకు మాయని మచ్చ తెచ్చారని సిపిఎం పార్టీగా అభిప్రాయపడుతున్నాము. సిఐ శ్రీ హర్ష మీద పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి క్రిమినల్ కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాము. ఈ కార్యక్రమంలో ప్రాంతీయ కమిటీ సభ్యులు పుష్పరాజు పోతలయ్య చంద్రశేఖర్ రెడ్డి సిపిఎం నారాయణస్వామి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply