రైతాంగ సంక్షేమమే లక్ష్యం…

ఆలేరు, ఆంధ్రప్రభ : రైతాంగ సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం అగ్ర ప్రాధాన్యత ఇస్తుందని యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపల్ చైర్మన్ బీజని బాలమణి భాస్కర్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎం.ఏ. ఎజాస్ అన్నారు. ఆలేరు పెద్దవాగులోకి నీటి విడుదల జరిగిన సందర్భంగా శనివారం వారు మీడియాతో మాట్లాడారు.

రైతుల సాగునీటి అవసరాలను దృష్టిలో పెట్టుకొని, భూగర్భ జలాల పెంపు కోసం గత రెండు సంవత్సరాలుగా పలుమార్లు వాగుల ద్వారా నీటిని విడుదల చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వం దేనని వారు పేర్కొన్నారు.

ఆలేరు ప్రజలు, రైతుల నీటి అవసరాలను గుర్తించి ఎప్పటికప్పుడు నీటిని విడుదల చేయించడంలో ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య ముందుండి పనిచేస్తున్నారని ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ అంగడి ఆంజనేయులు, కౌన్సిలర్లు, పలువురు ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.