సీనియర్ ఎస్జీటీలకు అన్యాయం జరిగితే సహించం

కడెం, ఆంధ్రప్రభ : జిల్లాలో స్కూల్ అసిస్టెంట్లతో పాటు సీనియర్ ఎస్జీటీలకు కూడా జనాభా గణన విధులు కేటాయించాలని ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షుడు భూక్య రాజేష్ నాయక్, ప్రధాన కార్యదర్శి క్రాంతికుమార్ డిమాండ్ చేశారు. శనివారం కడెం జడ్పీ ఉన్నత పాఠశాలలో జరిగిన సమావేశంలో వారు మాట్లాడారు.
జిల్లాలో చాలామంది సీనియర్ ఉపాధ్యాయులకు మాత్రమే ఎన్యుమరేటర్ విధులు కేటాయించాలని కొందరు ప్రయత్నిస్తున్నారని, ఎస్జీటీలలో కూడా సీనియర్ ఉపాధ్యాయులు ఉన్నారని వారు పేర్కొన్నారు. ఎస్జీటీలకు సమాన ప్రాధాన్యత ఇవ్వకపోతే భవిష్యత్తులో అన్ని సంఘాలతో కలిసి తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఆర్థిక ప్రయోజనం చేకూరే అంశాల్లో ఎస్జీటీలను దూరంగా పెట్టడం సరైంది కాదని, ఈ విషయంలో అన్ని సంఘాలు ఒకే విధంగా ఆలోచించాలని అన్నారు. సభ్యత్వం కోసం మాత్రమే ఎస్జీటీలను ఉపయోగించుకుంటున్నారని విమర్శించారు.
భవిష్యత్తులో ఎస్జీటీ ఉపాధ్యాయులు ఐక్యంగా కార్యాచరణ రూపొందించి తమ సంఘాన్ని బలోపేతం చేసే దిశగా పోరాటం ప్రారంభిస్తామని తెలిపారు.
