విరాళాలతో వ్యాయామశాల ఏర్పాటు

చిట్యాల, ఆంధ్రప్రభ: మండలంలోని చల్లగరిగ ఉన్నత పాఠశాల ఆవరణలో గ్రామ ప్రజలు, యువత, క్రీడాకారులు స్వచ్ఛందంగా విరాళాలు సేకరించి వ్యాయామశాల ఏర్పాటు చేశారు. గ్రామ ప్రజలు, యువత, క్రీడా పోషకులు, క్రీడాకారుల సహకారంతో సుమారు రూ.1 లక్ష 50 వేలతో వ్యాయామశాల ఫ్లోరింగ్ పనులు పూర్తి చేసినట్లు తెలిపారు.

అలాగే వ్యాయామశాలకు అవసరమైన 18 రకాల పరికరాలను సుమారు రూ.5 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసినట్లు చెప్పారు. వ్యాయామశాల నిర్మాణానికి వచ్చిన విరాళాలు, ఖర్చుల వివరాలను కమిటీ సభ్యులు క్రీడాకారుల సమక్షంలో పరిశీలించినట్లు తెలిపారు.

మిగిలిన పనులు పూర్తి చేయడానికి దాతలు సహకరించాలని వ్యాయామశాల నిర్మాణ కమిటీ సభ్యులు కోరారు.