మహాగంలో గాలివాన బీభత్సం..

మహాగంలో గాలివాన బీభత్సం..

  • నాలుగు ఇండ్ల రేకులు, స్తంభాలు చెట్లు నేలమట్టం
  • నష్టాన్ని పరిశీలించిన సర్పంచ్ అధికారులు

జైనూర్, ఆంధ్రప్రభ : కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ (యు) మండలంలోని మహాగాంలో గురువారం సాయంత్రం గాలి వాన బీభత్సం సృష్టించింది. దీంతో ఆ గ్రామంలోని నాలుగు ఇండ్ల రేకులు గాలికి లేచి నేలమటమయ్యాయి. ఇండ్లకు చాలా నష్టం జరిగింది. దీంతోపాటు చెట్లు విద్యుత్ స్తంభం లో నే లమటమై ఆ గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయి అంధకారం నెలకొంది. గాలి వాన బీభత్సంతో మాహగం చెందిన సెద్మకి విష్ణు కాంత్ మడావి కృష్ణ సాయి రే లక్ష్మణ్ మడవిలింగు లకు చెందిన ఇండ్ల రేకులు ఎగిసిపడి ఇండ్లకు నష్టం వాటిల్లింది.

ఈ విషయం తెలుగానే మాహ గం సర్పంచ్ సెద్మకి జానేరావు అధికారులకు సమాచారం ఇచ్చారని గాలి వాన బీభత్సవానికి నాలుగు ఇండ్లకు చాలా నష్టం జరిగిందని సర్పంచ్ జనవరి తెలిపారు. సర్పంచ్ సమాచారంతో సిర్పూర్ (యు ) ఆర్ ఐ నవీన్ జిపిఓ శ్రీనివాస్ సందర్శించి జరిగిన నష్టాన్ని పరిశీలించారు. జరిగిన నష్టం పై జిల్లా కలెక్టర్ కు నివేదిక పంపిస్తామని వారు తెలిపినట్లు సర్పంచ్ పేర్కొన్నారు. అధికారులు పరిశీలించగా వారి వెంట సర్పంచ్ తో పాటు వార్డ్ సభ్యులు శ్రీరామ్, షేకు ప్రజలు పాల్గొన్నారు.

Leave a Reply