డ్రైనేజీ పనులు ప్రారంభించిన సర్పంచ్, అధ్యక్షులు..

డ్రైనేజీ పనులు ప్రారంభించిన సర్పంచ్, అధ్యక్షులు..

భీమారం, ఆంధ్రప్రభ : హనుమకొండ జిల్లా హాసన్ పర్తి మండలం నాగారం గ్రామం పదో వార్డ్ లో డ్రైనేజీ పనులకు శనివారం సర్పంచ్ లావణ్య సంతోష్ శంకుస్థాపన చేశారు.

ఈ కార్యక్రమం లో మండల అధ్యక్షుడు పోరెడ్డి మహేందర్ రెడ్డి, మైనార్టీ సెల్ అధ్యక్షుడు మహమ్మద్ అన్వర్ ఖాన్, గ్రామ కార్యదర్శి గరిగే ప్రశాంతి, వార్డు మెంబర్లు తదితరులు పాల్గొన్నారు.