7th Ward | ప్రజా సమస్యల పరిష్కారంలో స్పీడ్..!
7th Ward | ప్రజా సమస్యల పరిష్కారంలో స్పీడ్..!
-7వ వార్డులో ఎమ్మెల్యే, ఎంపీ సహకారంతో అభివృద్ధి జోరు..!
-ఆ దిశగా కౌన్సిలర్ అన్నెపు సుమలత కుమార్ ముందడుగు…
-ఎట్టకేలకూ ఎన్టీఆర్ కాలనీలో నీటి సమస్యకు చెక్..!
-ఎండాకాలం ముందే తాగునీటి సమస్య పరిష్కారం
-కాలనీ అభివృద్ధిపై కౌన్సిలర్ సుమలత ప్రత్యేక దృష్టి
-ముఖ్యంగా నీరు, డ్రైనేజ్, కరెంట్ సమస్యలపై చర్యలు
-ప్రజల సమస్యలపై వెంటనే స్పందిస్తున్న కౌన్సిలర్
-కృతజ్ఞతలు తెలుపుతున్న వార్డు ప్రజలు
7th Ward | స్టేషన్ ఘన్ పూర్, ఆంధ్రప్రభ : స్టేషన్ ఘన్‌పూర్ మున్సిపాలిటీ పరిధిలోని 7వ వార్డులో అభివృద్ధి పనులు రోజురోజుకు వేగం పుంజుకుంటున్నాయి. ప్రజల అవసరాలను ముందుగానే గుర్తించి స్పందించే నాయకత్వంతో స్థానిక కౌన్సిలర్ అన్నె పు సుమలత కుమార్ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు. ముఖ్యం గా తాగునీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్న ఎన్టీఆర్ కాలనీ ప్రజ లకు ఆమె తీసుకున్న తాజా నిర్ణయం కాలనీలో కొత్త ఊపిరి నింపింది. ఎండాకాలం ప్రారంభంతోనే నీటి కొరత తీవ్రంగా మారుతుందని ఆమె అంచనా వేసింది. ఈ సమస్య పెద్దదిగా మారక ముందే స్పందించి శని వారం నూతన బోర్ మోటార్ ఏర్పాటు చేయించారు. దీంతో ఎన్నో రోజులుగా నీటి కోసం అవస్థలు పడుతున్న కాలనీ వాసులకు పెద్ద ఊర ట లభించింది. కాలనీలో ఇప్పుడు ప్రతి ఇంటికి నీటి సౌకర్యం కల్పించ డంతో కాలనీ వాసుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది.

తాగునీటి సమస్యతోనే ఆగిపోలేదు..
కౌన్సిలర్ సుమలత కుమార్ సేవలు కేవలం తాగునీటి సమస్య పరిష్కా రంతోనే ఆగిపోలేదు. చైర్మన్ సహకారంతో కాలనీలో నెలకొన్న డ్రైనేజ్ సమస్యలను కూడా ఆమె ప్రాధాన్యతగా తీసుకున్నారు. వర్షాకాలంలో మురుగునీరు నిలిచి పోవడంతో ప్రజలు అనారోగ్య సమస్యలకు గుర వుతున్న పరిస్థితిని ఆమె గమనించారు. సంబంధిత అధికారులతో సమన్వయం చేసి డ్రైనే జ్ వ్యవస్థను మెరుగుపరిచే చర్యలు తీసుకు న్నారు. కాలనీ వీధుల్లో పరిశుభ్రత పెంపు, నీటి నిల్వలను తొలగించడం వంటి చర్యలు చేపట్ట డం ద్వారా ప్రజలకు ఆరోగ్య భద్రత కల్పించేందు కు కృషి చేస్తున్నారు.

విద్యుత్ సమస్యలపై ఆరా..
తరచూ ఎదురయ్యే విద్యుత్ అంతరాయాలపై కూడా ఆమె గట్టిగా స్పందించారు. లైన్ సమస్యలు, లో వోల్టేజ్ సమస్యలపై అధికారులను కదిలించి తక్షణ పరిష్కారం దిశగా చర్యలు తీసుకోవడం జరిగింది. కాల నీలో విద్యుత్ సరఫరా సజావుగా ఉండేలా పర్యవేక్షణ కొనసాగిస్తున్నా రు. ప్రజలతో నిత్యం మమేకమై వారి సమస్యలను దగ్గరగా తెలుసుకో వడం సుమలత కుమార్ ప్రత్యేకతగా నిలుస్తోంది. కాలనీ వీధుల్లో తిరు గుతూ ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ వారి సమస్యలు వినడం, వెంటనే పరిష్కార మార్గాలు చూపడం ద్వారా ప్రజల్లో నమ్మకం పెంచు తున్నారు. మా సమస్యల కోసం ఎప్పుడైనా అందుబాటులో ఉండే నాయకురాలు అంటూ కాలనీ వాసులు అభిప్రాయపడుతున్నారు.

ఎమ్మెల్యే, ఎంపీ ఆశీస్సులతో అభివృద్ధి కార్యక్రమాలు: (కౌన్సిలర్ అన్నెపు సుమలత కుమార్)
ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఎంపీ కావ్య ఆశీస్సులతో అభివృద్ధి కార్యక్ర మాలు వేగంగా కొనసాగుతున్నాయని కౌన్సిలర్ అన్నెపు సుమలత కుమార్ తెలిపారు. ఎన్నికైనప్పటి నుంచి ప్రజల ప్రాథమిక అవసరాలపై దృష్టి పెట్టి తక్షణ చర్యలు తీసుకోవడమే తన లక్ష్యమని పేర్కొన్నారు. అర్హులైన వారిని గుర్తించి ఇళ్ల మంజూరు చేయిస్తామని తెలిపారు. సీసీ రోడ్ల నిర్మాణం, వీధి దీపాల ఏర్పాటు వంటి పనులను ప్రణాళికాబద్ధంగా ముందుకు తీసుకెళ్తున్నామని చెప్పారు. ప్రజల సమస్యలే మా ప్రాధా న్యం…ఎన్టీఆర్ కాలనీని ఆదర్శవంతమైన కాలనిగా తీర్చిదిద్దడం మా సంకల్పమని ఆమె స్పష్టం చేశారు. ప్రజలతో కలిసిమెలిసి వారి నమ్మ కాన్ని నిలబెట్టుకుంటూ అభివృద్ధి పనులను వేగవంతం చేయడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు బూర్ల రమేష్, చాతరబోయిన హరీష్, అన్నెపు వెంకటయ్య, లొంకా విజేందర్, వడకం హరీష్, బూర్ల రాకేష్‌తో పాటు మున్సిపల్ సిబ్బంది జక్కుల మహేష్, పొన్నం రమేష్, ఎడ్ల రాజు తదితరులు పాల్గొన్నారు.
