సర్పంచ్‌లకు అందని గౌరవ వేతనం

సర్పంచ్‌లకు అందని గౌరవ వేతనం

– ఐదు నెలలుగా పెండింగ్‌లోనే

ఎల్కతుర్తి, ఆంధ్రప్రభ:
కొత్తగా ఎన్నికైన సర్పంచ్‌లకు ఇప్పటివరకు గౌరవ వేతనం అందకపోవడంతో వారు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. డిసెంబర్‌లో జరిగిన పంచాయతీ ఎన్నికల అనంతరం అదే నెల 22న కొత్త సర్పంచ్‌లు బాధ్యతలు స్వీకరించారు. అయితే బాధ్యతలు చేపట్టి ఐదు నెలలు గడిచినా ఇప్పటివరకు గౌరవ వేతనం విడుదల కాకపోవడంతో సర్పంచ్‌లలో అసంతృప్తి వ్యక్తమవుతోంది.

గత ప్రభుత్వంలో సర్పంచ్‌లకు నెలకు రూ.6,500 గౌరవ వేతనం అందించగా, ప్రస్తుతం తమ బ్యాంకు ఖాతా వివరాలు అధికారులు సేకరించినప్పటికీ వేతనాలు మాత్రం జమ కాలేదని వారు తెలిపారు. గతంలో మాదిరిగా గౌరవ వేతనం కొనసాగుతుందా లేదా అనే అనుమానం కూడా సర్పంచ్‌లలో నెలకొంది. ఐదు నెలలుగా వేతనాలపై ఎలాంటి స్పష్టత లేకపోవడంతో వారు అయోమయానికి గురవుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి పెండింగ్‌లో ఉన్న గౌరవ వేతనాలను వెంటనే విడుదల చేయాలని సర్పంచ్‌లు కోరుతున్నారు.

Leave a Reply