Reservations |బీసీల రిజర్వేషన్లపై ప్రైవేట్ బిల్లు పెట్టాలి…

Reservations | బీసీల రిజర్వేషన్లపై ప్రైవేట్ బిల్లు పెట్టాలి…

Reservations | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ హనుమంతరావు కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ రాహుల్ గాంధీకి లేఖ రాశారు. బీసీల రిజర్వేషన్లపై ప్రైవేట్ బిల్లు పెట్టాలని లేఖలో రాహుల్ గాంధీని కోరారు. 42శాతం రిజర్వేషన్లపై బిల్లు పెట్టాలని కోరారు. మల్లిఖార్జున ఖర్గే, వేణుగోపాల్, సీఎం రేవంత్ రెడ్డిలకు లేఖ రాశానన్నారు.

మోడీ బీసీ అయినా న్యాయం జరగడం లేదన్నారు. ఢిల్లీ తెలంగాణ భవన్ లో శ్రీరాముని కల్యాణం జరగడం లేదన్నారు. ఢిల్లీలో శ్రీరాముని కల్యాణం జరపాలని సీఎంను కోరుతానన్నారు.

Leave a Reply