ఆటో బోల్తా పడి విద్యార్ధి మృతి..

గీసుగొండ, ఆంధ్రప్రభ : రోడ్డు ప్రమాదంలో గాయపడిన 10వ తరగతి స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం గొర్రెకుంట గ్రామానికి చెందిన ప్రవీణ్, సునీత దంపతుల కుమారుడు అక్షయ్ గురువారం ఉదయం తాగునీటి కోసం ఆటోలో వెళ్తుండగా, గొర్రెకుంట గ్రామ సమీపంలో ఆటో అదుపుతప్పి బోల్తాపడింది.

ఈ ప్రమాదంలో అక్షయ్ తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే స్పందించిన స్థానికులు అతడిని ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అక్షయ్ మృతి చెందినట్లు తెలిపారు. అక్షయ్ గొర్రెకుంట ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నాడు. అతని మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.