26thMarchCartoon | ఆంధ్రప్రభలో నేటి కార్టూన్ ఔరా

26thMarchCartoon | ఆంధ్రప్రభలో నేటి కార్టూన్ ఔరా

26thMarchCartoon గ్యాస్, పెట్రోల్ సమస్యలపై ప్రజల ఆందోళన
బంకుల వద్ద కిక్కిరిసిన పరిస్థితి
అధికారుల మాటలపై అనుమానాలు
కార్టూన్‌లో వ్యంగ్యం, చమత్కారం
కార్టూన్ ప్రత్యేకత

26thMarchCartoon
26thMarchCartoon

ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : అదుగోపులి అంటే ఇదిగో తోక అన్నట్టు తయారయ్యింది పరిస్థితి. ఒకపక్క గ్యాస్ కొరతతో అల్లాడుతుంటే, మూలిగే నక్కమీద తాటిపండు పడ్డట్టు మీదొచ్చి పడింది పెట్రోల్ సమస్య. ఇంకేముంది…పొలోమంటూ బారులు తీరారు వాహనదారులు…క్రిక్కిరిసిన పెట్రోల్ బంకులతో రోడ్లన్నీ జాం…గంటలకొద్దీ పెట్రోల్ కోసం నిరీక్షణ. కానేకాదు, అసలు గ్యాసూ పెట్రోలుకు ఎలాంటి కొరతా లేదంటూ పాలకులు, సంబంధిత అధికారులు చెప్పే మాటలు కంటి తుడుపు చర్యగా భావిస్తున్నారే తప్ప నమ్మడం లేదు జనం. అవును మరి అందరి దగ్గరా సెల్ ఫోన్లున్నాయి, అందులో ఇంటర్ నెట్ ఉంది…ఎప్పటికప్పుడు ప్రపంచ పరిణామాలు గమనిస్తూనే ఉన్నారాయె.

ఇక్కడ ఉండి హార్ముజ్ జలసంధి వద్ద ఏం జరుగుతుందో తెలుసుకోగల సమాచార వ్యవస్థ మన దగ్గర ఉన్నప్పుడు అధికారుల మాటల్లో ఎంత నిజముందో తెలుసుకోలేమా? అలాగని మరీ జాగ్రత్త పడాలని ప్రయత్నిస్తేనే ఇదిగో..ఇలా రోజంతా పెట్రోల్ బంకుల్లో నిరీక్షించాల్సి వస్తుంది

ఆందోళనతో కిక్కిరిసిన పెట్రోల్ బంకులో పాపం ఆఫీస్ అవర్స్ అంతా గడిచిపోయాయి. దాదాపు అందరి పరిస్థితీ అదే కావచ్చు.
అసలే మన ప్రధాని గారు పిలుపునిచ్చారు.
కరోనాకాలం నాటి పరిస్థితులను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని…ఏమో ఏమైనా జరగొచ్చు.

ఇదిగో..ఈ కార్టూన్ లో వ్యంగ్యం..చమత్కారం అదే. ఆంధ్రప్రభ అందించిన కార్టూన్ ”ఔరా” ఇది.
గత రెండు దశాబ్ధాలుగా ఆంధ్రప్రభ పాఠకులను, కార్టూన్ ఇష్టులను అలరిస్తోన్న కార్టూన్ ఫీచర్ ఔరా.

Leave a Reply