అబ్బాయిపాలెంలో నీటికొరత..

మరిపెడ, ఆంధ్రప్రభ : మండలం లోని అబ్బాయిపాలెం గ్రామంలో గత ఆరు నెలల నుండి నీటి కొరత ఉందని మహిళలు తెలిపారు. ఆదివారం గ్రామంలోని నాలుగో వార్డులో మహిళలు ఖాళీ బిందెలతో ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామపంచాయతీ పాలకవర్గం అధికారులకు చెబుతున్న ఎన్నిసార్లు చెప్పిన పట్టించుకోవటం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. పైపులైనున్నప్పటికీ మెయిన్ వాల్ మార్చాలని నీటి ప్రెషర్ పెంచాలని 6 నెలల నుండి చెబుతున్న కార్యదర్శి సర్పంచ్ నిర్లక్ష్యం చేస్తున్నారని, నీళ్లు రాకపోవడంతో నీటి హౌస్ లు ఎండిపోతున్నాయని మహిళలు పేర్కొన్నారు. ఇప్పటికైనా అధికారులు జోక్యం చేసుకోని తక్షణమే నీటి కొరత తీర్చాలని సిపిఎం వార్డ్ సభ్యురాలు నందిపాటి ఉప్పలమ్మ అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో వంగూరు ఉప్పలయ్య, ఉప్పలమ్మ, తిప్పర్తి మైసమ్మ, జిన్నా ఉపేంద్ర, సోమయ్య, ధనమ్మ ,మైసయ్య, తీగల పూలమ్మ, భిక్షం, గంగ రాము, సుజాత, సైదులు, జ్యోతి , యాకయ్య , తదితరులు ఉన్నారు.