Australia Fuel Crisis 26 : ఆస్ట్రేలియా లో నోస్టాక్ Andhra Prabha News
Australia Fuel Crisis 26 : ఆస్ట్రేలియా లో నోస్టాక్ Andhra Prabha News
- ఇంధన సంక్షోభం తీవ్రతరం
- న్యూ సౌత్ వేల్స్, విక్టోరియాలో నో స్టాక్ బోర్డులు
- 500కు పైగా గ్యాస్ స్టేషన్లు ఖాళీ
- పెరుగుతున్న డిమాండ్‌తో ఆయిల్ కొరత
- లాజిస్టిక్స్ సమస్యలతో సరఫరా అంతరాయం
( ఆంధ్రప్రభ, వెబ్ డెస్క )
Australia Fuel Crisis 26 : ఆస్ట్రేలియాలో ఇంధన అత్యవసర పరిస్థితి తీవ్రతరం కాగా, సంక్షోభం తారా స్థాయికి చేరడంతో వందలాది ఆయిల్ పంపులు నో స్టాక్ బోర్డులు పెట్టాయి. ఇంధన సంక్షోభంతో న్యూ సౌత్ వేల్స్ , విక్టోరియా వ్యాప్తంగా 500కు పైగా గ్యాస్ స్టేషన్లు ఖాళీ అయ్యాయి. సరఫరాలో అంతరాయాలు. విపరీతంగా పెరుగుతున్న డిమాండ్ తో ఆయిల్ కొరత ఆకాశాన్ని అంటుంతోంది. ఆస్ట్రేలియాలోని అత్యధిక జనాభా కలిగిన ఈ రెండు రాష్ట్రాలలో ఆయిల్ పంపుల మూసివేతలు చోటుచేసుకున్నాయి. లాజిస్టిక్స్ నెట్‌వర్క్‌లు పంపులలో ఇంధనాన్ని తిరిగి నింపడానికి ఇబ్బంది పడుతున్న తరుణంలో వేలాది మంది వాహనదారులు చిక్కుకుపోతారని, దీర్ఘకాలిక అస్థిరత కొనసాగుతుందని అధికారులు హెచ్చరిస్తున్నారు.
ALSO READ : 13 Us Military Bases Smash : 13 అమెరికా గూళ్లు గుల్ల Andhra Prabha News
