ఘనంగా శ్రీ రాముని జయంతి, విద్యాపీఠ ఆవిర్భావ దినోత్సవం….
ఘనంగా శ్రీ రాముని జయంతి, విద్యాపీఠ ఆవిర్భావ దినోత్సవం….
ముధోల్, ఆంధ్రప్రభ : ముధోల్ మండల కేంద్రములోని శ్రీ సరస్వతీ శిశు మందిర్ ఉన్నత పాఠశాలలో శ్రీరామ నవమిని పురస్కరించుకుని మర్యాద పురుషోత్తముడు హిందువుల ఆరాధ్యదైవం హిందుత్వానికి ప్రతీకగా నిలిచిన “శ్రీరాముని జయంతినిష, శ్రీ సరస్వతీ విద్యాపీఠం ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. సహ ఆచార్యులు రాజశ్రీ శ్రీరామ నవమి విశిష్టతను తెలియజేయగా, ప్రధానాచార్యులు సారథి రాజు విద్యాపీఠ ఆవిర్భావ దినోత్సవం గురించి వివరించారు.
ఈ సందర్భంగా ముత్యాల కిషన్ మాట్లాడుతూ విద్యార్థులు శ్రీ రామున్ని ఆదర్శంగా తీసుకుని అతని గుణగణాలు పెంపొందించుకుని ఉత్తమ భావి పౌరులుగా ఎదగాలని ఆకాంక్షించారు. జిల్లా ఉపాధ్యక్షులు ధర్మపురి సుదర్శన్, శ్రీ రామ నవమి గురించి, శ్రీ సరస్వతీ విద్యాపీఠం గురించి సంక్షిప్తంగా తెలుపుతూ శ్రీ సరస్వతీ శిశు మందిర్ ఉన్నత పాఠశాల స్థాపన గురించి దాని వికాస యాత్ర గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల సాంస్కృతిక నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి.

ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు ధర్మపురి సుదర్శన్, పాఠశాల సమితి ఉపాధ్యక్షులు ముత్యాల కిషన్, అధ్యక్షులు కొండావార్ సంజీవ్, కార్యదర్శి వేదపాఠక్ నిశికాంత్ ,సహా కార్యదర్శి దర్భార్ నవీన్, ప్రబంధకారిణి సభ్యులు కంది మానాజీ , కందొల్ల దత్తాత్రి , ఆచార్యులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

