రూ,1040 కోట్లతో వరంగల్ బల్దియా బడ్జెట్.. ఆమోదం

రూ,1040 కోట్లతో వరంగల్ బల్దియా బడ్జెట్.. ఆమోదం

ఉమ్మడి వరంగల్, ఆంధ్రప్రభ : వరంగల్ మహా నగర పాలక సంస్థ రానున్న ఆర్థిక సంవత్సరానికి రూ,1040 కోట్ల అంచనాలతో బడ్జెట్ ప్రవేశపెట్టింది. బుధవారం జరిగిన సంస్థ పాలకమండలి సమావేశం బడ్జెట్ ను ఏకగ్రీవంగా ఆమోదించింది. మేయర్ గుండు సుధారాణి అధ్యక్షతన జరిగిన గ్రేటర్ వరంగల్ బడ్జెట్ సమావేశానికి, జిల్లా కలెక్టర్ ఇన్చార్జి కమిషనర్ చాహత్ బాజ్ పాయ్, కార్పొరేటర్లు హాజరయ్యారు.ఈ సందర్భంగా 1040 కోట్ల,58లక్షల,75 వేలతో 2026-27 సంవత్సరానికి ప్రవేశపెట్టిన బడ్జెట్ ను పాలకవర్గం ఆమోదించింది. ఇందులో రూ, 349 కోట్ల 19 లక్షలు సాధారణ పన్నుల ద్వారా, రూ685 కోట్ల 20లక్షలు వివిధ గ్రాంట్ల ద్వారా, రూ620కోట్లు డిపాజిట్లు అడ్వాన్సుల ద్వారా సమకూరుతుందని అంచనా వేశారు. సమావేశంలో డిప్యూటీ మేయర్ రిజ్వానాషమీమ్ మసూద్ తో పాటు కార్పొరేటర్లు అధికారులు పాల్గొన్నారు

Leave a Reply