11వ వార్డులో సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన
11వ వార్డులో సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన
యాదగిరిగుట్ట, ఆంధ్రప్రభ : మున్సిపాలిటీ పరిధిలోని 11వ వార్డులో సీసీ రోడ్డు నిర్మాణానికి మున్సిపల్ చైర్మన్ గుండ్లపల్లి వాణి భరత్ గౌడ్ చేతుల మీదుగా శంకుస్థాపన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు స్థానిక కౌన్సిలర్లు నాయకులు అధికారులతో కలిసి ప్రత్యేక పూజలు చేసి శంకుస్థాపన నిర్వహించారు. ఈ సందర్భంగా కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ గుండ్లపల్లి వాణి భరత్ గౌడ్ మాట్లాడుతూ ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య మున్సిపాలిటీకి ప్రత్యేక నిధులు కేటాయించి యాదగిరిగుట్ట మున్సిపాలిటీ నీ రోల్ మోడల్ గా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారని ఆమె తెలిపారు.
అదేవిధంగా ఆమె మాట్లాడుతూ ప్రజా పాలనలో భాగంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని ఆమె అన్నారు. 12 వార్డులలో నాణ్యమైన సిసి రోడ్ల నిర్మాణ నానికి కృషి చేస్తున్నామని ఆమె తెలిపారు. అదేవిధంగా 11వ వార్డు కౌన్సిలర్ ముకర్ల మల్లేష్ యాదవ్ మాట్లాడుతూ మున్సిపాలిటీలో సీసీ రోడ్లు పెద్ద ఎత్తున ఏర్పాటు చేసి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ బరిగే రమ్య రామచందర్ కౌన్సిలర్లు బూడిద మధు తదితర స్థానిక వార్డు కౌన్సిలర్లు నాయకులు గుండ్లపల్లి భరత్ గౌడ్, బందారపు బిక్షపతి , గుడ్ల నరేష్ కుమార్ మున్సిపల్ కమిషనర్ లింగస్వామి మున్సిపల్ అధికారులు, సిబ్బంది పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
