Sri leela | ఫామ్ లోకి వచ్చేది ఎప్పుడు..?

Sri leela | ఫామ్ లోకి వచ్చేది ఎప్పుడు..?

Sri leela | సక్సెస్ నుంచి ప్లాపుల వరకూ శ్రీలీల ప్రయాణం
ఉస్తాద్ భగత్ సింగ్‌పై ఆశలు.. నిరాశే మిగిలిందా?
ధనుష్ 55పై శ్రీలీల ఫోకస్
తిరిగి ఫామ్‌లోకి రావాలంటే హిట్ తప్పనిసరి

Sri leela | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : శ్రీలీల.. ఒకప్పుడు వరుసగా సక్సెస్ సాధించింది. ఇప్పుడు.. ఈ డ్యాన్సింగ్ బ్యూటీ.. వరుసగా ప్లాపులు ఇస్తుంది. ఈమధ్య కెరీర్ లో వెనకబడింది. ఇలాంటి టైమ్ లో.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ కు జంటగా ఉస్తాద్ భగత్ సింగ్ మూవీలో నటించింది. ఈ సినిమా పై చాలా ఆశలు పెట్టుకుంది. అయితే.. అమ్మడుకి నిరాశే ఎదురైంది కానీ.. ఉస్తాద్ అంచనాలకు తగ్గట్టుగా ఆకట్టుకోలేదు అనేది వాస్తవం. ఇప్పుడు శ్రీలీలలో టెన్షన్ స్టార్ట్ అయ్యిందట. మరి.. ఈ బ్యూటీ సక్సెస్ సాధించేది ఎప్పుడు..? తిరిగి ఫామ్ లోకి వచ్చేది ఎప్పుడు..?

Sri leela | పుష్ప 2 తో శ్రీలీల ఫేమస్..

Sri leela

పెళ్లి సందడి సినిమాతో కెరీర్ స్టార్ట్ చేసిన శ్రీలీల.. తొలి సినిమాలోనే అందం, అభినయంతో ఆకట్టుకుంది. కమర్షియల్ గా కూడా సక్సెస్ సాధించింది. ఆతర్వాత ధమాకా మూవీతో మరో సక్సెస్ సొంతం చేసుకుంది. ఇక భగవంత్ కేసరి మూవీలో అయితే.. సక్సెస్ సాధించడమే కాదు గుడ్ పర్ ఫార్మర్ అనిపించుకుంది. అయితే.. ఆతర్వాత చేసిన స్కంధ, ఆదికేశవ, ఎక్స్ ట్రా ఆర్డినరీ మేన్ సినిమాలు వరుసగా ఫ్లాప్ అయ్యాయి. సూపర్ స్టార్ మహేష్‌ బాబుతో కలిసి నటించిన గుంటూరు కారం సినిమా సక్సెస్ సాధించింది. ఆతర్వాత పుష్ప 2 లో కిసిక్ అంటూ ఐటం సాంగ్ చేసి పాన్ ఇండియా రేంజ్ లో ఫేమస్ అయ్యింది.

Sri leela | ధనుష్ 55 పైనే ఆశలు..

Sri leela

అయితే.. ఈమధ్య కాలంలో శ్రీలీల నటించిన జూనియర్, మాస్ జాతర, పరాశక్తి చిత్రాలు ప్లాప్ అయ్యాయి. ఇక ఉస్తాద్ భగత్ సింగ్ మూవీతో ఫామ్ లోకి రావచ్చని ఎదురు చూస్తే.. ఈ మూవీ మెప్పించలేకపోయింది. ఇలా వరుస ప్లాపులు రావడంతో టాలీవుడ్ లో శ్రీలీల పని అయిపోయినట్టే అనేట్టుగా సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు. మరి.. శ్రీలీలకు సక్సెస్ అందించే సినిమా ఏది అంటే.. ప్రస్తుతం ఈ అమ్మడు ధనుష్ 55వ సినిమాలో నటిస్తుంది. ఇందులో ఫిదా బ్యూటీ సాయిపల్లవి కూడా నటిస్తుంది. ఈ మూవీని అమరన్ డైరెక్టర్ రాజ్ కుమార్ పెరియసామి తెరకెక్కిస్తున్నారు. ఇప్పుడు శ్రీలీల ఆశలన్నీ ఈ సినిమా పైనే. మరి.. ఈ మూవీ అయినా శ్రీలీలకు సక్సెస్ అందిస్తుందేమో చూడాలి.

Sri leela