108 vehicle | చర్చి ప్రతిష్ట కార్యక్రమానికి వెళ్లి…

108 vehicle | చర్చి ప్రతిష్ట కార్యక్రమానికి వెళ్లి…

ఎదురెదురుగా ఢీకొన్న ద్విచక్ర వాహనాలు

108 vehicle | వెలుగోడు, ఆంధ్ర‌ప్ర‌భ : శ్రీశైలం నియోజకవర్గ పరిధిలోని వేల్పనూరు రహదారిలోనీ మంచినీళ్ళ వాగు మలుపు వద్ద ఆదివారం మధ్యాహ్నం రెండు గంటలకు ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వడ్ల రామాపురానికి చెందిన కాసారపు అశోక్ కుమార్, గుంత కందాల గ్రామానికి చెందిన సౌందరరాజు ఇద్దరు స్నేహితులు వేల్పనూరు సి ఎస్ ఐ చర్చి ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొని వెలుగోడు కు వస్తుండగా, రేగడ గూడూరు గ్రామానికి చెందిన ఆర్షద్ తన తండ్రి మౌలాలిలు బండి ఆత్మకూరు గ్రామంలో హమాలీ పని ముగించుకొని స్వగ్రామం రేగడ గూడూరు వెళుతుండగా వెలుగోడు వేల్పనూరు గ్రామాల మధ్య మంచినీళ్ళవాగు మలుపు వద్ద ఎదురెదురుగా రెండు ద్విచక్ర వాహనాలు వేగంగా ఢీకొనడంతో వడ్ల రామాపురం కు చెందిన అశోక్ కుమార్ (19 సంవత్సరాలు) అక్కడికి అక్కడే మృతి చెందగా, మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో, క్షతగాత్రులను 108 వాహనంలో వెలుగోడు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

అశోక్ కుమార్ అప్పటికే మృతి చెందాడని, మిగిలిన ముగ్గురు క్షతగాత్రులను ప్రధమ చికిత్స నిర్వహించి, వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో అత్యవసర చికిత్స నిమిత్తం నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వెలుగోడు పోలీసులు కేసు నమోదు చేసుకుని, పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆత్మకూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.

click here to read more : Bandi Sanjay : సన్ స్ట్రోక్.. Andhra Prabha Top Story

click here to read more :

Leave a Reply