ఎంపీ నిధులు తీసుకొచ్చి గ్రామాభివృద్ధి చేస్తా..

ఊట్కూర్, ఆంధ్రప్రభ : ఎంపీడీకే అరుణ సహకారంతో నిధులుతీసుకొచ్చి గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని మొగ్ధంపూర్ సర్పంచ్ తిరుమలేష్ అన్నారు. మంగళవారం నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల పరిధిలోనిమొగ్దుంపూర్ లో ఎంపీ డీకే అరుణ నిధులు రూ.5 లక్షల్లో నిధులతో సిసిరోడ్డుపనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ ఎంపీ నిధులతో గ్రామంలో నెలకొన్న వివిధ సమస్యలు పరిష్కరిస్తూ రాష్ట్ర ప్రభుత్వ నిధులు తీసుకొచ్చి గ్రామ అభివృద్ధి లక్ష్యంగా కృషి చేస్తానని అన్నారు.
ప్రభుత్వం చేపడుతున్న ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో వివిధ పనులు చేపడుతున్నామని ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు దశలవారీగా నెరవేరుస్తానని అన్నారు. ఎంపీ నిధులతో ఐమాక్స్ లైట్లు సిసి రోడ్లు డ్రైనేజీ పనులు చేపట్టామని రానున్న కాలంలో మరిన్ని నిధులు తీసుకువస్తానని అన్నారు. మొగ్ధంపూర్ గ్రామ ప్రజలు ఎంతో నమ్మకంతో గెలిపించారని ఐదేళ్లలో గ్రామ రూపురేఖలు మారుస్తానని అన్నారు.
అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించి ప్రభుత్వం చేపడుతున్న ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. ప్రభుత్వం మంజూరు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలు అర్హులైన పేదవారికి అందే విధంగాచూస్తాననిఅన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ నరేందర్, పంచాయతీ కార్యదర్శి భాస్కర్ వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
