సిరిసిల్ల కోర్టుకు బాంబు బెదిరింపు
సిరిసిల్ల కోర్టుకు బాంబు బెదిరింపు
- కోర్టు అఫీషియల్ మెయిల్ కు సందేశం
- రంగంలోకి దిగిన స్పెషల్ స్కాడ్ పోలీసులు
- కోర్టు పరిసర ప్రాంతాల్లో విస్తృత తనిఖీలు
రాజన్న సిరిసిల్ల, ఆంధ్రప్రభ : రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రధాన న్యాయస్థానానికి బాంబు బెదిరింపు వచ్చింది. జిల్లా కోర్టు ప్రాంగణంలో బాంబు పెట్టి న్యాయస్థానాన్ని పేలుస్తామని, కోర్టు అఫిషియల్ మెయిల్ ఐడికి ఆదివారం గుర్తు తెలియని అకౌంట్ నుండి గుర్తు తెలియని వ్యక్తులు మెయిల్ పంపారు.

సోమవారం ఉదయం కోర్టు కార్యాలయానికి వచ్చిన సిబ్బంది బాంబు బెదిరింపు మెయిల్ గమనించి అప్రమత్తమయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో డాగ్, బాంబు స్క్వాడ్ బృందాలు కోర్టు ప్రాంగణానికి చేరుకొని, కోర్టు పరిసర ప్రాంతాల్లో విస్తృతంగా తనిఖీ చేపట్టాయి.
కాగా.. కోర్టులో న్యాయవాదులు, కచ్చిదారులు భయాందోళనకు లోనయ్యారు. కాగా జిల్లా కోర్టుకు బాంబు బెదిరింపు సందేశం రావడం ప్రస్తుతం జిల్లా కేంద్రంలో చర్చనీయాంశం అయింది. కోర్టు పరిసర ప్రాంతాల్లో పోలీస్ శాఖ పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేయాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు..
