భగత్ సింగ్‌కు ఘన నివాళి..

బెజ్జంకి, ఆంధ్రప్రభ : భారత స్వాతంత్ర్య సమరయోధుడు భగత్ సింగ్ 95వ వర్ధంతి సందర్భంగా బెజ్జంకి మండల కేంద్రంలో అఖిల భారత యువజన సమాఖ్య (AIYF) ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఎఐవైఎఫ్ బెజ్జంకి మండల కార్యదర్శి దొంతరవేని మహేష్ నాయకత్వంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ దుమాల మహేష్ భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ భగత్ సింగ్ వంటి విప్లవయోధులు యువతకు ఎప్పటికీ ప్రేరణగా నిలుస్తారని, సమసమాజ నిర్మాణానికి వారి ఆలోచనలు మార్గదర్శకమని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ఎఐవైఎఫ్ సిద్ధిపేట జిల్లా మాజీ అధ్యక్షుడు బోనగిరి శ్రావణ్, రొడ్డ చరణ్, రావుల రాజు, చిలుముల శ్రీనివాస్, బండిపెల్లి సాయి వర్ధన్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply