24వ వార్డులో కాంగ్రెస్ గెలుపు ఖాయం

24వ వార్డులో కాంగ్రెస్ గెలుపు ఖాయం
- ప్రచారంలో స్వరూప ముందంజ
పెద్దపల్లి, ఆంధ్రప్రభ : పట్టణంలోని 24వ వార్డులో కాంగ్రెస్ పార్టీ దూసుకుపోతుంది. హస్తం పార్టీ అభ్యర్థి కొట్టే స్వరూప సదానందం ప్రచారంలో విపక్ష పార్టీల అభ్యర్థులకు దీటుగా ముందుకెళ్తున్నారు. వార్డు పరిధిలోని ఇంటింటికి వెళ్లి ఈ నెల 11వ తేదీన జరిగే పోలింగ్ లో చేతి గుర్తుపై ఓటు వేసి తనను గెలిపించాలని అభ్యర్థించారు. అనంతరం మాట్లాడుతూ వార్డు ప్రజలు తనకు మద్దతి ఇచ్చి కౌన్సిలర్ గా అవకాశం ఇస్తే 24 గంటల పాటు అందుబాటులో ఉండి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.
వార్డు పరిధిలో సిసి రోడ్లు డ్రైనేజీల నిర్మాణంతో పాటు ఇతర అభివృద్ధి పనులు చేపట్టి ఆదర్శ వార్డుగా తీర్చిదిద్దుతా అన్నారు. ఇతర పార్టీల నాయకులు ఎన్ని ప్రలోభాలకు గురిచేసిన లొంగవద్దని, సేవ చేసే వారిని ఎన్నుకోవాలన్నారు. ఆదరించి అవకాశం ఇస్తే అందుబాటులో ఉండి సేవలందిస్తానన్నారు. ఎమ్మెల్యే విజయ రమణారావు సహకారంతో వార్డును ఆదర్శంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ దూసుకుపోతుండడంతో 24వ వార్డులో స్వరూప గెలవడం పక్కా అని ప్రజలు చర్చించుకుంటున్నారు.
