భక్తి శ్రద్దలతో రంజాన్ వేడుకలు…

భక్తి శ్రద్దలతో రంజాన్ వేడుకలు…
శావల్యాపురం, ఆంధ్రప్రభ : మండలంలోని శానంపూడి, వేల్పూరు, శావల్యాపురం, కారుమంచి తదితర గ్రామాలలో ముస్లిం సోదరులు రంజాన్ పర్వదిన వేడుకలు శనివారం రోజున ఘనంగా నిర్వహించారు. రంజాన్ పండుగను పురస్కరించుకొని ముస్లిం సోదరులు ఉదయం మసీదులకు వెళ్లి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి అనంతరం ర్యాలీగా గ్రామాల్లో ఉన్న ఈద్గా మైదానాలకు చేరుకున్నారు.
అక్కడ సాంప్రదాయ పద్ధతులతో ఈద్గా మైదానంలో ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించారు. ప్రజల మధ్య శాంతి, సామరస్యాన్ని, సోదర భావాన్ని పెంపొందించే ఈ వేడుకను భక్తి పరవశంతో జరుపుకున్నారు. మండలంలోని కారుమంచి గ్రామంలో స్టేట్ బ్యాంక్ సమీపంలో ఉన్న ఈద్గా వద్ద హఫీజ్ మహమ్మద్ ఇనాం ఆధ్వర్యంలో ముస్లిం సోదరులు సామూహిక ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం ధార్మికో ఉపన్యాసం చేశారు. ధనిక, పేద అన్న తారతమ్యం లేకుండా ఒకరికొకరు ఆలింగణం చేసుకున్నారు.


