సింగిల్ యూస్ ప్లాస్టిక్ రహిత గ్రామంగా తీర్మానం..
సింగిల్ యూస్ ప్లాస్టిక్ రహిత గ్రామంగా తీర్మానం..
వేల్పూర్, ఆంధ్రప్రభ : నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం వేల్పూర్ మండలంలోని హనుమాన్ నగర్ గ్రమంలో సర్పంచ్ ఆధ్వర్యంలో శుక్రవారం రోజున గ్రమా సభ నిర్వహించారు. రానున్న నెల రోజుల్లో పూర్తి ప్లాస్టిక్ రహితముగా మార్చుటకు గ్రామస్థులు తీర్మానం చేసినట్లు సర్పంచ్ అల్లెపు నడిపి మల్లయ్య తెలిపారు.ఈ సందర్బంగా తమది చిన్న గ్రామము అయినందున గ్రామములో 500 స్టీల్ ప్లేట్లు అలాగే స్టీల్ గ్లాసులతో “స్టీల్ బ్యాంక్ ” ఏర్పాటుకు దాతల సహకారాన్ని కోరుతున్నట్లు తెలిపారు.
గ్రామస్థులందరు క్లాత్, జూట్ బ్యాగులనే వాడాలని తీర్మానించినమని సర్పంచ్ అన్నారు. అదేవిధంగా గ్రామంలోని వివిధ సమస్యలపై చర్చించారు. అనంతరం గ్రామ పంచాయతీ పారిశుధ్య కార్మికుడిని,అలాగే ఇటీవల శిక్షణ పూర్తి చేసుకున్న వార్డ్ సభ్యుల్ని సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ మణికాంత్, పంచాయతీ కార్యదర్శి భరత్ స్వరూప్, గ్రామస్థాయి అధికారులు, వార్డు సభ్యులు, గ్రామస్థులు పాల్గొన్నారు.
