దుర్గమ్మ ఆలయంలో సిబ్బంది బాధ్యతల మార్పులు..

దుర్గమ్మ ఆలయంలో సిబ్బంది బాధ్యతల మార్పులు..
- పరిపాలన సౌలభ్యం కోసం అంతర్గత బదిలీలు..
- సూపరింటెండెంట్లు, జూనియర్ అసిస్టెంట్లకు కొత్త బాధ్యతలు..
ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ : విజయవాడలోని ఇంద్రకీలాద్రి పై ఉన్న శ్రీ దుర్గ మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో పరిపాలనను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు సిబ్బంది బాధ్యతల్లో మార్పులు చేస్తూ దేవస్థానం ఈవో ఉత్తర్వులు జారీ చేశారు. దేవస్థానం ఎస్టాబ్లిష్‌మెంట్ విభాగం ద్వారా విడుదలైన ఉత్తర్వుల్లో భాగంగా పలువురు సూపరింటెండెంట్లు, జూనియర్ అసిస్టెంట్ల బాధ్యతలను పునర్విభజించారు. సూపరింటెండెంట్ కె. శ్రీనివాసరావు (చందు)కు ఆలయ ప్రధాన, ఉప ఆలయాలు, గోశాల, ప్రచార రథం, గర్లాండ్స్, ఫ్రూట్స్ టెండర్ల బాధ్యతల నుండి అకామిడేషన్, వేదపాఠశాల, దత్త ఆలయాల పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించారు.
సూపరింటెండెంట్ వి. సూర్యనారాయణ మూర్తికి అకామిడేషన్, వేదపాఠశాల బాధ్యతల స్థానంలో కేశఖండనశాల, దుర్గాఘాట్ నిర్వహణ, కృష్ణమ్మ హారతులు బాధ్యతలు ఇచ్చారు. సూపరింటెండెంట్ వై. హేమ దుర్గాంబకు కేశఖండనశాల, ఘాట్ నిర్వహణ బాధ్యతల నుంచి ఆడిట్, జనరల్, డైవర్షన్స్, అన్నదానం విభాగాల బాధ్యతలు అప్పగించారు. జూనియర్ అసిస్టెంట్ ఎం. రమేష్‌ను మెయిన్ టెంపుల్ ఇన్‌స్పెక్టర్ బాధ్యతల నుంచి ఉపహిల్ల్స్ శానిటేషన్ పర్యవేక్షణ, లీజులు, లైసెన్సులు, వసూళ్లు, వస్త్రాల నిల్వ నిర్వహణ విభాగానికి మార్చారు. జూనియర్ అసిస్టెంట్ వి. జగన్నాథరావును శానిటేషన్, లీజులు, వసూళ్ల విభాగం నుంచి మెయిన్ టెంపుల్ ఇన్‌స్పెక్టర్‌గా నియమించారు. ఈ మార్పులతో దేవస్థానం పరిపాలనలో మరింత సమర్థత పెరుగుతుందని అధికారులు అభిప్రాయపడ్డారు. సంబంధిత అసిస్టెంట్ ఈవోలు, సూపరింటెండెంట్లు వెంటనే బాధ్యతలు స్వీకరించి విధులు నిర్వర్తించాలని ఆదేశించారు.
