Krishna-Double-Murder : హంతకుడు ఒక్కడు కాదు Andhra Prabha Crime News

Krishna-Double-Murder : హంతకుడు ఒక్కడు కాదు Andhra Prabha Crime News

  • మామ అల్లుడిపై కిరాతక దాడి
  • మృతదేహాలను తాళ్లతో కట్టి
  • కాలువలో జలసమాధి
  • దృశ్యం తరహాలో .. ఘోరం
  • దర్యాస్తులో కృష్ణా పోలీసులు బిజీబిజీ

ఆంధ్రప్రభ, న్యూస్​ నెట్​ వర్క్​ ప్రతినిధి

కృష్ణాజిల్లా కృత్తివెన్ను మండలం చిన్న గొల్లపాలెం గ్రామంలో అమానుష ఘటనఓ మిస్టరీ కాదు. మామా అల్లుడిని హతమార్చింది ఒకడు కాదు. కనీసం ముగ్గురు లేదా నలుగురు చంపేశారు. దృశ్యం సినిమా స్టయిల్​ లో సాక్ష్యాలను జల సమాధ చేయాలని భావించారు. వీరిద్దరి మృతదేహంపై గాయాలను పరిశీలిస్తే… వీరిని దారుణంగా కొట్టి చంపేశారు. ఈ కేసును కృత్తివెన్ను పోలీసులు లోతుగా విచారిస్తున్నారు. వీరిపై అమానుష దాడికి కారణమేంటనే కోణంలో దర్యాప్తు సాగుతోంది. చేపల వేటకి వెళ్లిన మామా అల్లుడిని గుర్తుతెలియని వ్యక్తులు దారణంగా హత్య చేశారు. కొత్త కాలవ మొగ లో బైక్ కి తాళ్లతో కట్టిన మృతదేహాలు లభించటంతో స్థానికులు అవాక్కయ్యారు. ఈ సమాచారంతో నేర స్థలికి చేరిన పోలీసులు. మృతదేహాలను వెలికి తీశారు. శెట్టి సుబ్బన్న, గొలుసు అయ్యప్పగా మృతులను గుర్తించారు. ఘటన స్థలిలో లభించిన ఆధారాలతో హత్యగా పోలీసులు నిర్ధారించారు.

Krishna-Double-Murder : అసలు కథ

చిన్నగొల్లపాలెం గ్రామానికి చెందిన శెట్టి ఏడుకొండలు ఫిర్యాదు మేరకు, ఏడుకొండలు తండ్రి శెట్టి సుబ్బన్న(51) , అల్లుడు అయ్యప్ప కుటుంబ సభ్యులతో చేపల వేటకు వెళ్తారు. ప్రతిరోజు రాత్రి వేటకు వెళ్ళి చేపలు పట్టుకుని ఉదయం మొగల్తూరు ముత్యాలపల్లి మార్కెట్లలో అమ్ముతుంటారు, ఈ నెల .27 న సాయంత్రం 06 గంటలకు ఏడుకొండలు తన భార్య మౌనికతో కలిసి నరసాపురం అత్తారింటికి వెళ్ళిడు. రాత్రి 08 గంటలకు తండ్రి సుబ్బన్న కు ఫోన్ చేయాగ పిల్లలు పడుకున్నారు. బావ గొలుసు అయ్యప్ప కలిసి చేపల వేటగా వెళుతున్నట్టు సమాధానం ఇచ్చాడు. 28వ తేదీ తెల్లవారుజామున ఏడుకొండలు ఇంటికి వచ్చాడు. కాలువలో తాను కట్టిన వల వద్దకు వెళ్లాడు. ఆ తరువాత ఇంటికి వెళ్లగా.. తన బావ, తండ్రి ఇంటికి రాలేదని చెల్లి సేట్టి నాగమ్మ ఆందోళన వ్యక్తం చేసింది. బావ మరిది, తండ్రి జాడ కోసం ఏడుకొండలు వెతికాడు. అంతర్వేది మార్కెట్టులోనూ ఆరా తీశాడు. ఈ రోజున బావమరిది, తండ్రి శవాలు కాలువలో లభించాయి. పశ్చిమ గోదావరి, కృష్ఱాజిల్లాల సరిహద్దు గ్రామం చిన్న గొల్లపాలెంలో ఈ హత్య ఘటన తీవ్ర సంచలనం రేపుతోంది.

Krishna-Double-Murder : తెరమీదకు కొత్త ట్విస్టులు

తొలుత ఈ కేసును అనుమానస్పద మృతి గా పోలీసులు నమోదు చేశారు. కానీ మృతదేహాలను బైకుకు కట్టి కాలువలోకి జారిన వైనంపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సైగా మృతదేహాలపై గాయాలు కనిపించటంతో హత్యగా అధికారులు దృవీకరించారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం తరలించారు. ఇక ఈ కేసులో అధికారులకు కీలక ఆధారం లభించింది. హతుడు సుబన్న సెల్​ ఫోన్​ దొరికింది సుబ్బన్న కాల్​ డేటాతో.. మరింత సమాచారాన్ని పోలీసులు సేకరిస్తున్నారు. ఈ హత్యోదంతంలొ కుటుంబ తగాదాలు ఉన్నాయా? అనే కోణంలోనూ.. చేపల వేటకు వెళ్లిన సమయంలో .. ఇతరుల వలకట్ట నుంచి చేపలు దొంగిలించారా? లేక హతుడు అయ్యప్పకు అక్రమ సంబధం నేపథ్యమా. అనే కోణాల్లోనూ పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.