నార్సింగిలో ఘనంగా ఉగాది వేడుకలు

నార్సింగి, ఆంధ్రప్రభ : మెదక్ జిల్లా నార్సింగి పట్టణంలోని శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించగా, ఆలయ గ్రామ పురోహితులు పుల్యాకుల నాగరాజు శర్మ. పుల్యాకుల వినీత్ శర్మతో పాటు సీనియర్ నాయకులు ఆకుల మల్లేశం గౌడ్, ఉపసర్పంచ్ రాజేందర్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో పంచాంగ శ్రవణ కార్యక్రమాన్ని నిర్వహించారు. పరాభవ నామ సంవత్సరానికి సంబంధించిన పాడిపంటలు, వర్షపాతం, సంభవించే విపత్తులపై వివరాలను భక్తులకు వినిపించారు. ఈ కార్యక్రమంలో గ్రామ నాయకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
