Vikarabad గరం గరం పిఎసిఎస్ సమావేశం

Vikarabad గరం గరం పిఎసిఎస్ సమావేశం

  • చైర్మన్–డైరెక్టర్ల మధ్య వాదోపవాదాలు.. కొద్దిసేపు ఉద్రిక్తత

వికారాబాద్(Vikarabad), ఆంధ్రప్రభ:

శివారెడ్డిపేట పిఎసిఎస్ సాధారణ సమావేశం బుధవారం గరం గరంగా జరిగింది. సమావేశానికి పిఎసిఎస్ చైర్మన్ ముత్యం రెడ్డి అధ్యక్షత వహించగా, డీసీసీబీ డైరెక్టర్ కిషన్ నాయక్, డైరెక్టర్లు వెంకట్ రెడ్డి, యాచారం నర్సింలు, కేశవ్ పల్లి జనార్దన్ రెడ్డి తదితరులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా పులుసుమామిడిలో నిర్మించిన గోదాముల అంశంపై డీసీసీబీ డైరెక్టర్ కిషన్ నాయక్ వివరాలు కోరగా, చైర్మన్ ముత్యం రెడ్డి సంబంధిత వివరాలను వెల్లడించారు. అయితే కాంట్రాక్టర్‌కు చెల్లింపుల విషయంలో ఇరువురి మధ్య వాదనలు చోటుచేసుకున్నాయి.

పిఎసిఎస్ సీఈవో కార్యదర్శి ప్రబ్లింగం శాంతి పరిస్థితిని సర్దుబాటు చేసేందుకు ప్రయత్నించినప్పటికీ మాటామాట పెరిగి కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. సమావేశంలో చైర్మన్, డైరెక్టర్ల మధ్య వాదోపవాదాలు కొనసాగి, కొంతసేపు గదిలో గందరగోళ వాతావరణం ఏర్పడింది.

అనంతరం పరిస్థితి చల్లబడిన తర్వాత సమావేశం కొనసాగినట్లు సమాచారం.

Leave a Reply