Babu-Jagan | సాంప్రదాయ దుస్తుల్లో సీఎం, మాజీ సీఎం

Babu-Jagan | సాంప్రదాయ దుస్తుల్లో సీఎం, మాజీ సీఎం
Babu-Jagan | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది (Ugadi) పండుగ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu), మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి (Jagan Mohan Reddy) సంప్రదాయ దుస్తుల్లో కనిపించారు.
సీఎం చంద్రబాబు పంచె కట్టుకొని, భుజంపై కండువా వేసుకొని తెలుగుదనం ఉట్టిపడేలా కనిపించారు. వీరిద్దరూ ఎప్పుడూ ఒకే తరహా దుస్తుల్లో కనిపించేవారు. ఈ కొత్త లుక్ (new look) లో వారిని చూసిన అభిమానులు, పార్టీ కార్యకర్తలు సోషల్ మీడియాలో ఫోటోలను షేర్ చేస్తూ, తమ అభిమాన నాయకులకు ఉగాది శుభాకాంక్షలు తెలుపుతున్నారు. రోజూ కార్యక్రమాలతో బిజీ షెడ్యూల్ లో ఉండే ఇద్దరు నేతలు ఉగాది పండుగ సందర్భంగా సాంప్రదాయ దుస్తులు ధరించి అందరినీ ఆకట్టుకునేలా చేశారు.
