dhoni| ఆయన గ‌దిలో అది ఉంటుంది

dhoni| ఆయన గ‌దిలో అది ఉంటుంది

ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : టీమిండియా మాజీ కెప్టెన్, సీఎస్కే దిగ్గజం ఎంఎస్ ధోనీకి ఓ అల‌వాటు ఉంద‌ని ఇంగ్లాండ్ క్రికెటర్ సామ్ బిల్లింగ్స్ వెల్ల‌డించారు. ధోనీ ‘షీషా మ్యాన్’ అని బిల్లింగ్స్ చమత్కరించాడు. ధోనీ గురించి ఆయ‌న మ‌రికొన్ని వియాలు ఆయ‌న పంచుకున్నారు. ధోనీకి హుక్కా(షీషా) తాగా అలవాటు ఉందని , అది అంటే ఆయ‌న‌కు చాలా ఇష్టమని, ఆయన హోటల్ గదిలో ఎప్పుడూ హుక్కా సిద్ధంగా ఉండేదని తెలిపారు. అయితే ఆ హుక్కాను రెడీ చేసే బాధ్యతను టీమిండియా పేసర్ ఖలీల్ అహ్మద్ చూసుకునేవాడ‌ని తెలిపారు.

ధోని వ్య‌క్తిగ‌తంగా చాలా మంచి వ్య‌క్తి అని, యువ ప్లేయర్లు ఎవరైనా సరే సంకోచం లేకుండా ఆయన గదిలోకి వెళ్లొచ్చని.. అక్కడ కూర్చుని ధోనీతో క్రికెట్ ముచ్చట్లు లేదా ఇతర విషయాలు చర్చించవచ్చని సామ్ బిల్లింగ్స్ పేర్కొన్నాడు. తాను కూడా ధోనీతో కలిసి ఆయన గదిలో మాంచెస్టర్ యునైటెడ్ ఫుట్‌బాల్ మ్యాచ్‌లను వీక్షించేవాడినని బిల్లింగ్స్ తెలిపాడు.

ధోనీ కెప్టెన్సీ చేసే స‌మ‌యంలో చాలా ప్రశాంతంగా ఉంటాడని, అంతటి కూల్ వ్యక్తిని తాను ఇప్పటివరకు చూడలేదని బిల్లింగ్స్ ప్రశంసించాడు. సీఎస్కే జట్టులో ఓ సూపర్ స్టార్ హోదా ఉన్నప్పటికీ.. అందరితోనూ చాలా ఈజీగా కలిసిపోతాడని కొనియాడాడు. సామ్ బిల్లింగ్స్ 2018, 2019 సీజన్లలో చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడి, జట్టు విజయాల్లో తనవంతు పాత్ర పోషించిన సంగతి తెలిసిందే.