నవోదయ ఫలితాలు విడుదల..

నవోదయ ఫలితాలు విడుదల..
కుంటాల, ఆంధ్రప్రభ : నవోదయ ఫలితాలు విడుదల కావడంతో మండల కేంద్రమైన కుంటాల సృజన విద్యా నిలయం ప్రభంజనం సృష్టించింది. దీంతో సృజన విద్యా నిలయం నుంచి 37 మంది విద్యార్థులు ప్రభజన సృష్టించారు. నవోదయలో చదువుకునేందుకు ఎంపికయ్యారు. ఇందులో భాగంగా కాగజ్ నగర్ జోహార్ నవోదయ పాఠశాలకు 23 మంది, నిజామాబాద్ జిల్లాలోని నిజాంసాగర్ జవహర్ నవోదయ పాఠశాలకు 13 మంది, వరంగల్ జగిత్యాల జిల్లాల జోహార్ నవోదయ పాఠశాలకు ఎంపికైనట్టు సృజన విద్యార్థి ప్రిన్సిపల్ కొత్త కాపు గంగన్న తెలిపారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా టాపర్ గా ఓడ్నం సహర్ష, నిజామాబాద్ జిల్లా టాపర్ గా రాజారాం లేక్షన నిలిచారు.
కల్లూరులోని ఎస్ఎంఎస్ ప్రైవేటు పాఠశాల నుండి 17 మంది విద్యార్థులు ప్రతిభ కనబరచగా శాంతినికేతన్ విద్యా నిలయం నుండి 11 మంది విద్యార్థులు నవోదయకు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా మొత్తం కుంటాల మండలంలో నవోదయలోని ప్రైవేటు పాఠశాలకు చెందిన విద్యార్థులు నవోదయలో ప్రతిభ కనబరచడం.. ప్రభంజనం సృష్టించారు. నవోదయలో విద్యార్థులు ఆణిముత్యాలు కావడంతో విద్యార్థులను మండల ప్రజలు సైతం అభినందిస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కాకుండా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి, కుంటాల మండల కేంద్రంలోని సృజన విద్యా నిలయంతో పాటు శాంతినికేతన్ విద్యానిలయం నుంచి అధిక సంఖ్యలో విద్యార్ధులు నవోదయలో ప్రతిభ కనబరిచారు. ఈ సందర్భంగా విద్యార్ధినీ విద్యార్థులను సృజన ప్రిన్సిపల్ కొత్త కాపు గంగన్న తోపాటు శాంతినికేతన్ విద్యా నిలయం ఎస్ఎంఎస్ ప్రిన్సిపాల్స్ డి సంతోష్ కుమార్, ప్రవీణ్ కుమార్, శ్రీకాంత్ అభినందనలు తెలిపారు.
పట్టుదలతో చదువుకుంటే ఏదైనా సాధించవచ్చు
క్రమశిక్షణ పట్టుదలతో చదువుకుంటే విద్యార్థి ఏదైనా సాధించవచ్చని సృజన శాంతినికేతన్ ఎస్ఎంఎస్ ప్రిన్సిపల్ అన్నారు. యువకులు పట్టుదలతో కష్టపడి చదివితే నవోదయతో పాటు సైనిక్ లో కూడా సత్తాసాటి సీటు పొందవచ్చని వారు పేర్కొన్నారు. కుంటాల మండలంలో గత సంవత్సరంలో కూడా అపూర్వంగా మెరుగైన ఫలితాలు వచ్చాయి. మరోసారి నవోదయలో ఉత్తమ ఫలితాలు రావడంతో మండల ప్రజలతో పాటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా, నిజామాబాద్ జిల్లా ప్రజలు సైతం పాఠశాల సిబ్బందిని అభినందిస్తున్నారు.

