నాలుగు లేన్ల రోడ్డు నెల రోజుల్లో ప్రారంభించాలి..

నాలుగు లేన్ల రోడ్డు నెల రోజుల్లో ప్రారంభించాలి..

లేదంటే పేటకు పాదయాత్ర చేపడతాం
హామీలను అమలు చేయడంలో విఫలమైన ప్రభుత్వం
బిజెపి రాష్ట్ర నాయకులు కొండయ్య
జిల్లా అధ్యక్షులు కొండ సత్య యాదవ్
ధర్నాను ఉద్దేశించి మాట్లాడుతున్న బిజెపి రాష్ట్ర నాయకులు కొండయ్య
తహశీల్దార్ కు వినతి పత్రం అందజేస్తున్న బిజెపి నాయకులు

మక్తల్ , ఆంధ్రప్రభ : రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా శంకుస్థాపన చేసిన మక్తల్ నారాయణపేట నాలుగు లైన్ల రోడ్డు పనులు మూడు నెలలు దాటిన ప్రారంభం కాలేదని మక్తల్ మాజీ ఎంపీపీ బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొండయ్య ,బిజెపి జిల్లా అధ్యక్షులు కొండ సత్య యాదవ్ అన్నారు. రోడ్డు నిర్మాణ పనులను నెల రోజుల్లోపు ప్రారంభించాలని లేదంటే మక్తల్ నుండి నారాయణపేటకు బిజెపి ఆధ్వర్యంలో పాదయాత్ర చేపడతామని అన్నారు. బిజెపి రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయకుండా విఫలమైన ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ మంగళవారం మక్తల్ లో బిజెపి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ ధర్నా నిర్వహించారు.

పట్టణంలోని రామ్ లీలా మైదానం నుండి భారీ ర్యాలీగా వచ్చిన బిజెపి శ్రేణులు తహశీల్దార్ కార్యాలయం వద్ద బైటాయించి ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మక్తల్ నుండి నారాయణపేటకు నాలుగు లేన్ల రోడ్డును ఏర్పాటు చేస్తున్నామని గొప్పగా శంకుస్థాపన చేశారని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి శంకుస్థాపన చేసి మూడు నెలలు దాటిన తట్టెడు మన్ను తీయలేదు కదా ఈంచ్ రోడ్డు పడలేదని అన్నారు. ప్రభుత్వం వెంటనే రోడ్డు నిర్మాణ పనులు చేపట్టాలని లేదంటే బిజెపి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని వారు హెచ్చరించారు.

రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి రెండున్నర సంవత్సరాలు పూర్తి కావస్తున్న ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలను మోసం చేస్తుందని ధ్వజమెత్తారు. రైతు భరోసా, వృద్ధాప్య, వితంతు, వికలాంగుల పెన్షన్లు, నిరుద్యోగ భృతి, జాబ్ క్యాలెండర్ ఇలా అన్ని విషయాల్లో ఇచ్చిన హామీలను అమలుపరచకుండా అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన భూభారతి రెవెన్యూ సదస్సులో భూ సమస్యల పరిష్కారం కోసం ప్రజల దరఖాస్తులు చేసుకున్నప్పటికీ వారి సమస్యలు ఇంకా పరిష్కారం కాలేదని అన్నారు. రాబోయే కాలంలో ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతారని అన్నారు.

ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి జి.బలరాం రెడ్డి ,నాయకులు కర్ని స్వామి, దేవరింటి నరసింహ రెడ్డి , కావలి వెంకటేష్,ప్రతాప్ రెడ్డి, వెంకట్ రాములు, అర్బన్ ,రూరల్ మండలాల అధ్యక్షులు బి.రాజశేఖర్ రెడ్డి,ఎం. ప్రతాప్ రెడ్డి ,మున్సిపల్ కౌన్సిలర్లు పీకే .నరసింహ, టప్ప కృష్ణ, రాజశేఖర్ రెడ్డి,కాట్రేవుపల్లి సర్పంచ్ బాల్రాజ్ ,పట్టణ ప్రధాన కార్యదర్శి అశోక్ , నాయకులు వన్నడ శ్రీకాంత్, బుగ్గన, చందాపూర్ రాము, బాల్రెడ్డి, నగరేష్ ,విద్యాసాగర్, అమరచింత శివరాములు, మహదేవ్, నరసింహారెడ్డి,బ్యాటరీ రాజు ,నాగరాజు,కొండయ్య, శ్రీధర్, రాజు , రామ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply