మంత్రి వాకిటి శ్రీహరి ఆరోగ్యం కోసం ఆలయాల్లో ప్రత్యేక పూజలు
మక్తల్ , ఆంధ్రప్రభ : నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గ ఎమ్మెల్యే రాష్ట్ర పశుసంవర్థక క్రీడల శాఖ మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి ఆరోగ్యం త్వరగా కుదుటపడాలని కోరుతూ శనివారం నియోజకవర్గ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ప్రముఖ ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేయించారు. మంత్రి వాకిటి శ్రీహరి వైరల్ ఫీవర్ తో బాధపడుతూ కూడా అధికారిక కార్యక్రమంలో,పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూ వచ్చారు .దీంతో రెండు రోజుల క్రితం తీవ్ర అశ్వస్థకు గురి కావడంతో కుటుంబ సభ్యులు మంత్రిని హైదరాబాదులోని కేర్ ఆస్పత్రిలో చేర్పించారు .ప్రస్తుతం మంత్రి వైద్యుల పర్యవేక్షణలో ఐసీయూలో చికిత్స పొందుతున్నారు .నిరంతరం ప్రజల కోసం పనిచేస్తూ ప్రజల్లో ఉంటున్న మంత్రి ఒక్కసారిగా అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చేరడంతో ఆందోళనకు గురైన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మంత్రి త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ నియోజకవర్గంలోని మక్తల్, మాగనూర్, కృష్ణ ,ఆత్మకూరు,నర్వ మండలాల్లో ప్రముఖ ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేయించారు.
మక్తల్ పట్టణంలోని శ్రీ పడమటి అంజనేయ స్వామి దేవాలయం తో పాటు శ్రీ వేణుగోపాల స్వామి కదేవాలయంలోనూ మంండల పరిధిలోని మందన్ గోడ్ సీపనగుండ్లు శ్రీ దత్తాత్రేయ స్వామి దేవాలయం లోనూ మంత్రి పేరిట ప్రత్యేక అర్చనలు, అభిషేకాలు,పూజలు చేయించారు. ఈ కార్యక్రమంలో స్థానిక మున్సిపల్ చైర్పర్సన్ వాటికి మానస హన్మంతు, మున్సిపల్ కౌన్సిలర్లు కోళ్ల సంధ్యా వెంకటేష్, మార్కెట్ వైస్ చైర్మన్ బి. గణేష్ కుమార్ ,పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బోయ రవికుమార్,మండల కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్, సర్పంచుల సంఘం జిల్లా అధ్యక్షులు రాజేందర్ గౌడ్ ,నాయకుల అమరేందర్ రెడ్డి, నీల గౌడ్ ,కుర్మయ్య గౌడ్ ,పసుల రంజిత్ రెడ్డి ,వాకిటి భాస్కర్, తదితరులు పాల్గొన్నారు.

