ఘనంగా జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు..!

ఘనంగా జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు..!

నిరు పేదలకు నూతన వస్త్ర పంపిణీ…

కోడూరు – ఆంధ్రప్రభ : కోడూరు మండల కేంద్రంలో జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు మండల జనసేన పార్టీ ఆధ్వర్యంలో శనివారం ఘనంగా నిర్వహించారు. ముందుగా కోడూరు ప్రధాన సెంటర్లో పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. లింగారెడ్డి పాలెం గ్రామంలో కేక్ కట్ చేసి మిఠాయిలు పంచారు. నిరుపేదలైన ఎస్సీ ఎస్టీలకు నూతన వస్త్ర పంపిణీ చేశారు. అనంతరం జనసేన పార్టీ ఆశయాలను గూర్చి,మండల పరిధిలో చేసిన అభివృద్ధిని గూర్చి కొనియాడారు.

జనసేన పార్టీ నేతలు ప్రతి ఒక్కరు కూటమి పొత్తు ధర్మానికి అనుగుణంగా పని చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కోడూరు, అవనిగడ్డ మండలాల జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply