ఐదు లీటర్ల గుడుంబా పట్టివేత.. విక్రయదారుడు అరెస్ట్

ఐదు లీటర్ల గుడుంబా పట్టివేత.. విక్రయదారుడు అరెస్ట్

చిట్యాల, ఆంధ్రప్రభ :మండలంలోనీ తిరుమలాపురంలో అక్రమ గుడుంబా ఐదు లీటర్లు స్వాధీనం చేసుకొని, విక్రయా దారున్ని శుక్రవారం అరెస్టు చేసి రిమాండ్ పంపినట్లు, చిట్యాల ఎస్ఐ, పోచంపల్లి సతీష్ తెలిపారు. ​తిరుమలాపూర్ గ్రామానికి చెందిన జన్నె సారయ్య తన నివాసం వద్ద నిషేధిత గుడుంబా విక్రయిస్తున్నట్లు నమ్మదగిన సమాచారం మేరకు, తమ సిబ్బంది ఏఎస్ఐ సమ్మి రెడ్డి , కానిస్టేబుల్ సందీప్, వెళ్లగా నిందితుడి ఇంటి వద్ద 5 లీటర్ల గుడుంబా ప్యాకెట్లు స్వాధీనం చేసుకుని ,గుడుంబా విక్రయ దారిని పై కేసు నమోదు చేసి రిమాండ్ కు పంపినట్లు ఎస్సై సతీష్ తెలిపారు.

Leave a Reply