ఉద్యమకారుల కమిటీని స్వాగతిస్తున్నాం..

ఆలేరు, ఆంధ్రప్రభ : తెలంగాణ మలిదశ ఉద్యమకారుల సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం నియమించిన కమిటీని స్వాగతిస్తున్నామని శనివారం జరిగిన యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మలిదశ ఉద్యమకారుల వేదిక సమావేశం లో మాట్లాడిన నాయకులు అన్నారు. కన్వీనర్ మొరిగాడి వెంకటేష్, ఇక్కిరి శ్రీనివాస్, ఆడెపు బాలస్వామి, పిక్క శ్రీనివాస్, పసుపునూరి వీరేశం, ఎలగందుల సురేష్, కుడికాల భాను ప్రసాద్, ఎలగల హరికృష్ణ, అరిగే చంద్రశేఖర్, నారా నవీన్ పాల్గొన్నారు. 250 గజాల ఇంటి స్థలం, ఇందిరమ్మ ఇండ్లు, హెల్త్ కార్డు, తెలంగాణ సమరయోధునిగా గుర్తిస్తూ గుర్తింపు కార్డు ఇవ్వాలని సమావేశం ప్రభుత్వాన్ని కోరింది.