ఒత్తిడి లేకుండా పదవ తరగతి పరీక్షలు రాయాలి
ఒత్తిడి లేకుండా పదవ తరగతి పరీక్షలు రాయాలి
విద్యార్థులు పరీక్షలు అంటే భయం వీడాలి
ఆంధ్రప్రభ ద్వారా విద్యార్థులకు ముందస్తు శుభాకాంక్షలు తెలిపిన మంత్రి శ్రీధర్ బాబు
మంథని,ఆంధ్రప్రభ : పదవ తరగతి చదువుతున్న విద్యార్థులు ఒత్తిడి లేకుండా పరీక్షలు రాయాలని తెలంగాణ ఐటి, పరిశ్రమల, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు శుక్రవారం ‘ఆంధ్రప్రభ ‘తో ప్రత్యేకంగా పేర్కొన్నారు. శనివారం పదోతరగతి విద్యార్థులకు వార్షిక పరీక్షలు ప్రారంభమవుతున్న సందర్భంగా విద్యార్థులు ఒత్తిడిని జయించి పరీక్షలు రాయాలని సూచించారు.
అధికారులు పదో తరగతి పరీక్షలకు విద్యార్థులకు ప్రశాంతమైన వాతావరణం కల్పించేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పరీక్షలు జరిగాలని పేర్కొన్నారు. పదవ తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థులందరికీ ముందస్తుగా మంత్రి శ్రీధర్ బాబు శుభాకాంక్షలు తెలిపారు.
