సుల్తానాబాద్ ఆంధ్రప్రభ ఆగి ఉన్న లారీని కారు ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం పాలైన సంఘటన పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ శివారులో చోటుచేసుకుంది. రామగుండం కు చెందిన నిషార్ అహ్మద్, ఎండి గౌస్ లు హైదరాబాద్ వెళ్లి తిరుగు ప్రయాణంలో గోదావరిఖని కి వస్తుండగా సుల్తానాబాద్ శివారులోని లారీ అసోసియేషన్ సమీపంలో ఆగి ఉన్న లారీని ఢీకొట్టారు.
ఈ ప్రమాదంలో ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. పోస్టుమార్టం కోసం మృతదేహాలను సుల్తానాబాద్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలియజేశారు.