పదవ తరగతి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి

పదవ తరగతి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి

  • మండల విద్యాశాఖాధికారి నేర ఆంధ్రయ్య

కమ్మర్ పల్లి, ఆంధ్రప్రభ ; ఈ నెల 14 వ తేదీ నుంచి జరగనున్న పదవ తరగతి పరీక్షల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసామని ఎంఈవో నేర.ఆంధ్రయ్య గురువారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కమ్మర్ పల్లి మండలంలోని ఎనిమిది జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు, ఒకటి కేజీబీవీ, నాలుగు ప్రైవేట్ పాఠశాలల నుండి భీంగల్ మండలం జడ్పి హెచ్ ఎస్ మెండోరా పాఠశాల విద్యార్థులు కలిపి మొత్తం 478 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నట్లు ఆయన తెలిపారు.

ప్రభుత్వ పాఠశాలల నుండి 400,ప్రైవేట్ పాఠశాలలు నుండీ 78 మొత్తం 478 మంది వివిధ పాఠశాలల విద్యార్థులు పదవ తరగతి పరీక్షలకు హాజరవుతున్నారు అని తెలిపారు.పరీక్షల నిర్వహణకు చీఫ్ సూపరింటెండెంట్,డిపార్ట్మెంటల్, అధికారులను మరియు ఇన్విజి లేటర్లను నియమించడం జరిగిందన్నారు.కమ్మర్ పల్లి మండలంలోని నాలుగు పరీక్షా కేంద్రాలలో వీరు పరీక్షలు రాయనున్నట్లు తెలిపారు.

జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కమ్మర్ పల్లి, చౌటు పల్లి,కొనసముందర్, హాస కొత్తూరు,పరీక్ష కేంద్రలలో హాజరవుతారని తెలిపారు.మండల పరిధిలోని విద్యార్థులకు తగిన ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందన్నారు. పరీక్షల నిర్వహణకు పకడ్బందీ చర్యలు తీసుకుంటామని, పరీక్షల సందర్భంగా విద్యార్థులకు త్రాగునీరు, ప్రథమ చికిత్స మొదలగునవి అందుబాటులో ఉంచడం జరుగుతుంది అన్నారు.

పరీక్షలు ఉదయం 9:30 గంటల నుండి మధ్యాహ్నం 12:30 గంటల వరకు జరుగుతాయనీ తెలిపారు. విద్యార్థులు అందరు తమ తమ పరీక్ష కేంద్రాలకు ఉదయం 8:30 గంటలకు చేరుకోవాలని మండల విద్యా శాఖాధికారి నేర ఆంధ్రయ్య అన్నారు.

Leave a Reply