ఇందిరమ్మ ఇళ్లు పేదల ఆత్మగౌరవ ప్రతీక…
డోంగ్లి, ఆంధ్రప్రభ ; రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద మంజూరైన ఇంట్లో శుక్రవారం లింబూర్ గ్రామం లోని లబ్ధిదారురాలు లక్ష్మీబాయి సురేష్ గృహ ప్రవేశ కార్యక్రమం ఘనంగా జరిగింది. డోంగ్లీ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గజానంద్ దేశాయి స్థానిక సర్పంచ్ సుజాత శివారెడ్డి ఆధ్వర్యంలో లబ్ధిదారుల కుటుంబ సభ్యులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు,ఇంటిని మామిడి తోరణాలు,పూలతో అలంకరించారు. దేవుని పటాల ఎదుట ప్రత్యేక పూజలు నిర్వహించి లబ్ధిదారులతో గృహ ప్రవేశం చేయించారు.
ఈ సందర్భంగా గజానంద్ దేశాయి మాట్లాడుతూ.. జుక్కల్ ఎమ్మెల్యే తోటా లక్ష్మీకాంతారావు నాయకత్వం గతంలో ఎన్నడూ లేనివిధంగా నియోజకవర్గం లో పేదల సొంతింటి కల నెరవేరుతోందనీ,ఇందిరమ్మ ఇళ్లు పేదల ఆత్మగౌరవ ప్రతీక.మా నాయకుడు ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు సహకారం తో డోంగ్లీ మండలంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇల్లు వచ్చేలా కృషి చేస్తాం. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు ఇచ్చిన మాట అని అన్నారు,కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పరమేష్ పటేల్, సర్పంచ్ లు బస్వరాజ్ పటేల్, సంగ్రామ్ పటేల్,మాజీ ఎంపిటిసి దిన్ దయాల్,విలాస్ గైక్వాడ్ లబ్ధిదారుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
