సమాజ సేవలో ఆదర్శం.. స్టేషన్ ఘన్ పూర్ సర్కిల్ ఇన్స్ స్పెక్టర్

సమాజ సేవలో ఆదర్శం.. స్టేషన్ ఘన్ పూర్ సర్కిల్ ఇన్స్ స్పెక్టర్
రామలింగేశ్వర స్వామి దేవస్థానం పునర్నిర్మాణానికి రూ.20 వేల విరాళం
స్టేషన్ ఘన్ పూర్, ఆంధ్రప్రభ : దైవభక్తితో పాటు సమాజ సేవలోనూ ముందుండే స్టేషన్ ఘన్‌పూర్ సీఐ గుజ్జేటి సుజన వేణు దంపతులు ఆదర్శంగా నిలిచారు. మండలంలోని తాటికొండ గ్రామంలోని శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం పునర్ని ర్మాణం కోసం వారు అక్షరాలా రూ.20 వేల రూపాయలను విరాళంగా అందజేశారు. ఈ మొత్తాన్ని తాటికొండ గ్రామంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థాన అభివృద్ధి అసోసియేషన్ సభ్యులకు అందజేశారు.
దేవాలయ అభివృద్ధి కోసం వారు ముందుకు రావడం పట్ల గ్రామ పెద్ద లు, దేవస్థాన అభివృద్ధి కమిటీ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తూ కృతజ్ఞత లు తెలిపారు. ఈ సందర్భంగా సీఐ సుజన వేణు మాట్లాడుతూ గ్రామాల్లోని దేవాలయాలు ఆధ్యాత్మిక కేంద్రాలే కాకుండా ప్రజల్లో ఐక్యత ను పెంపొందించే పవిత్ర స్థలాలని అన్నారు. భక్తి భావంతో దేవాలయాల పరిరక్షణ, అభివృద్ధి కోసం ముందుకు రావడం సమాజానికి మంచి విషయమని పేర్కొన్నారు. అనంతరం గ్రామ ప్రజలు మాట్లాడుతూ… భక్తి భావంతో దేవాలయ పునర్నిర్మాణానికి సహాయం చేయడం ఎంతో అభినందనీయమని తెలిపారు. శ్రీ సీతారామచంద్ర స్వామి, శ్రీ రామలిం గేశ్వర స్వామి ఆశీస్సులు సీఐ గుజ్జేటి సుజన వేణు కుటుంబంపై ఎల్ల వేళలా ఉండాలని గ్రామస్తులు కోరుకున్నారు.
