గ్రామాభివృద్ధే ప్రజాపాలన లక్ష్యం: ఎమ్మెల్యే జీఎస్‌ఆర్
గ్రామాభివృద్ధే ప్రజాపాలన లక్ష్యం: ఎమ్మెల్యే జీఎస్‌ఆర్
రేగొండ, ఆంధ్రప్రభ:
ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా రేగొండ గ్రామంలో గురువారం నిర్వహించిన గ్రామసభకు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామసభల ప్రధాన ఉద్దేశం గ్రామాల సమస్యలను గుర్తించి, మౌలిక సదుపాయాలు, తాగునీరు, పారిశుద్ధ్యం, విద్యుత్ తదితర అంశాలపై ప్రజల అభిప్రాయాలను తెలుసుకోవడమేనని తెలిపారు.
పెన్షన్లు, రేషన్ కార్డులు, రైతు సంక్షేమ పథకాలతో పాటు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందుతున్నాయో లేదో గ్రామస్థులు పరిశీలించాలని సూచించారు.గ్రామ స్థాయి నుంచే సమగ్ర అభివృద్ధి ప్రణాళికలను రూపొందించి, ప్రజల అవసరాలకు అనుగుణంగా చర్యలు చేపట్టి గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తామని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, తహసీల్దార్ శ్వేతారావు, ఎంపీడీవో వెంకటేశ్వరరావు, వ్యవసాయ అధికారి పెద్ది వాసుదేవరెడ్డి, సర్పంచ్ వారణాసి మౌనిక, ప్రజాప్రతినిధులు, అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామస్థులు పాల్గొన్నారు.
