Minister | మంత్రి శ్రీహరి మాతృమూర్తికి ఘన సన్మానం

Minister | మంత్రి శ్రీహరి మాతృమూర్తికి ఘన సన్మానం

Minister | మక్తల్, ఆంధ్రప్రభ : అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నారాయణ పేట జిల్లా మక్తల్ పట్టణంలో స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర పశుసంవర్ధక క్రీడల శాఖ మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి మాతృమూర్తి రిటైర్డ్ స్టాఫ్ నర్స్ వాకిటి రాములమ్మ సిస్టర్ ను స్థానిక మున్సిపల్ కౌన్సిలర్ రహీం పటేల్ శాలువా పూలమాల తో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మక్తల్ నియోజకవర్గ సేవకై ఒక గొప్పకొడుకును జన్మనిచ్చిన తల్లి వేల మంది తల్లుల పురుడుపోసిన దేవత తెలంగాణ రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి మాతృమూర్తి వాకిటి రాములమ్మ సిస్టర్ ని సన్మానించి ఆశీర్వాదం తీసుకోవడం జరిగిందన్నారు.

Minister |
Minister |

సిస్టర్ గా స్థానిక ప్రభుత్వాసుపత్రిలో వేల మంది తల్లులకు పురుడు పోసిన గొప్ప మాతృమూర్తిగా అభివర్ణించారు. అలాంటి మాతృమూర్తిని మహిళా దినోత్సవం సందర్భంగా సన్మానించుకోవడం పూర్వజన్మ సుకృతమని అన్నారు. అప్పట్లో ప్రభుత్వాలు కూడా సేవలు గుర్తించి సత్కరించే పరిస్థితి అంతగా లేదని వాస్తవంగా రాములమ్మ సిస్టర్ సేవలకు రాష్ట్ర జాతీయ స్థాయి అవార్డు రావాల్సిందేనని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా మహిళా మణులందరికీ రహీం పటేల్ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.

CLICK HERE TO READ MORE : Mission | గోదల్‌లో జల మహోత్సవం…
CLICK HERE TO READ MORE :

Leave a Reply